అగ్నిధార న్యూస్ ,పెద్దపల్లి:

పెద్దపల్లి మండలంలో వంద శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేయాలి.
జిల్లా కో అపరేటివ్ అధికారి మైకేల్ బోస్

పెద్దపల్లి మండలం లో వంద శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేసేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని జిల్లా కో అపరేటివ్ అధికారి , మండల ప్రత్యేక అధికారి మైకేల్ బోస్ అన్నారు. బుధవారం మండలం లోని రాఘవపూర్ రైతువేధిక లో ఆశ కార్యకర్తలు, అంగన్వాడీ టీచర్లు, పంచాయతీ కార్యదర్శి లు, వైద్య సిబ్బంది తో వ్యాక్సినేషన్ పై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామాల్లో ఇంటింటా ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ అందించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. కోవిడ్ వ్యాక్సిన్ పై అపోహలు లేకుండా వారికి అవగాహన కల్పించాలని పేర్కొన్నారు.ఈ సమావేశంలో జిల్లా వైద్యాధికారి ప్రమోద్ కుమార్, తహశీల్దార్ శ్రీనివాస్, ఎంపిడిఓ రాజు.వైద్యులు పాల్గొన్నారు.