అగ్నిధార న్యూస్, పెద్దపల్లి:

డిగ్రీ ఫలితాలలో గాయత్రి విద్యార్థుల ప్రతిభ

శాతవాహన యూనివర్సిటీ బుధవారం ప్రకటించిన డిగ్రీ I,IV & VI సెమిస్టర్ ఫలితాలలో గాయత్రి డిగ్రీ & పి.జి.కళాశాల విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. బిఎస్సి & బీకం విభాగంలో గుంటి అంజలి జి పి ఏ 10/10, జోఆఫీయా నిషత్ 9.96, అనవేన జ్యోతి 9.89, వి.ఎస్.ఎస్.సాయి శర్మ 9.89, ఎక్రా తబస్సుమ్ 9.74 మార్కులు సాధించారు.మరియు 9.0 పైగా 145 మంది విద్యార్థులు మార్కులుసాధించారు.అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను కళాశాల అధినేత అల్లంకి శ్రీనివాస్  ప్రిన్సిపాల్ జె.రవీందర్ మరియు కళాశాల సిబ్బంది అభినందించారు.