అగ్నిధార న్యూస్, పెద్దపల్లి జిల్లా:

 ప్రజాసమస్యలను సత్వరమే పరిష్కరించాలి :: ప్రభుత్వ విప్ భానుప్రసాద్ రావు
• గ్రామాభివృద్దికి పటిష్ట చర్యలు చేపట్టాలి
• చివరి గింజ వరకు మద్దతు ధర పై నాణ్యమైన ధాన్యం కోనుగొలు
• 4.6 లక్షల ధాన్యం కొనుగొలు అంచనాతో 292 ధాన్యం కోనుగొలు కేంద్రాల ఏర్పాటు
ప్రతి ఒక్కరు స్వచ్చందంగా వ్యాక్సినేషన్ తీసుకోవాలి
హరితహారం కింద లక్ష్యాల మేరకు మొక్కలు నాటి సంరక్షించాలి
• వ్యాక్సినేషన్ పై అవసరపు అపోహలు వద్దు
• పల్లెప్రగతి, హరితహారం కార్యక్రమంలో స్థానిక కమిటిలను భాగస్వామ్యం చేయాలి
• సర్వసభ్య సమావేశంలో లేవనెత్తిన అంశాల పై అధికారులు సమాధానం అందించాలి
• ఎన్టిపిసి మిలినియం హల్ లో నిర్వహించిన జడ్పీ సర్వసభ్య సమావేశంలో పాల్గోన్న ప్రభుత్వవిప్  ప్రతినిధులు అధికారుల దృష్టికి తీసుకొని వచ్చిన సమస్యలను సత్వరమే పరిష్కరించాలని ప్రభుత్వ విప్ సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం ఎన్టిపిసిలోని మిలినియం హల్ లో జడ్పీ చైర్ పర్సన్ అధ్యక్షతన నిర్వహించిన జిల్లాప్రజాపరిషత్ సర్వసభ్య సమావేశంలో జిల్లా కలెక్టర్ తో కలిసి ఆయన పాల్గోన్నారు. సీఎం నిర్ణయం మేరకు గత సంవత్సరం లాగే రైతులకు అండగా ఉండే విధంగా గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతుల నుంచి ధాన్యాన్ని మద్దతు ధర పై కోనుగోలు చేస్తామని తెలిపారు. జిల్లాలో 2.11 లక్షల ఎకరాలో వరి సాగు జరిగిందని, సుమారు 5.11 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని, సోంత అవసరాలకు , ప్రైవేటు విక్రయం మినహాయించి జిల్లా వ్యాప్తంగా 292 కోనుగొలు కేంద్రాలు ఏర్పాటు చేసి 4.6 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగొలు చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. జిల్లాలో ప్రస్తుతం 52 లక్షల గన్నిలు అందుబాటులొ ఉన్నాయని, మరో 11 లక్షల గన్నీలు రైస్ మిల్లర్ల వద్ద అందుబాటులొ ఉన్నాయని, 15 లక్షల గన్నీ సంచలు జూన్ మిల్లుల నుంచి, మిగిలినవి సప్లయిర్స్ నుంచి ఏర్పాటు చేస్తామని అధికారులు వివరించారు. రైతు సంక్షేమం దిశగా ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుంటుందని , దేశంలో ఎక్కడా లేనివిధంగా రైతు బంధు, రైతు బీమా పథకాలను అమలు చేస్తున్నామని, జిల్లాలోని గ్రామాలో పల్లె ప్రగతి పెండింగ్ పనులు త్వరితగతిన జరిగేలా చర్యలు తీసుకోవాలని, గ్రామాలను హరిత గ్రామాలుగా తీర్చిదిద్దాలని సూచించారు. హరితహారం కింద నాటే మొక్కల సంరక్షణకు పటిష్ట చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రజలు మన పై ఉంచిన బాధ్యతను నెరవేర్చాలని , అధికారులతో సమన్వయం చేసుకుంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని తెలిపారు. స్థానిక సంస్థలకు నిధులు, విధులు కేటాయించే దిశగా సీఎం కేసిఆర్ చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. జడ్పీటిసి, ఎంపిటిసిల గౌరవ వేతనాలను ప్రభుత్వం పెంచిందని, అదే విధంగా జడ్పీటిసిల, ఎంపిటిసిలకు కార్యాలయ ఏర్పాటుకు, జాతీయ పర్వదినాలకు జాతీయపతాకావిష్కరణ చేయడానికి వీలుగా సైతం త్వరలో చర్యలు తీసుకుంటామని తెలిపారు. సమావేశంలో పాల్గోన్న జడ్పీ చైర్ పర్సన్ పుట్టమధు మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు అందే విధంగా చర్యలు తీసుకోవాలని జడ్పీ చైర్మన్ తెలిపారు. ఉపాథి హమి కింద చేపడతున్న పనులు, గ్రామీణాభివృద్ది, పంచాయతి రాజ్ పనులు , ధాన్యం కోనుగొలు తదితర అంశాల పై అధికారులతో చర్చించారు.

సమావేశంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ మాట్లాడుతూ సర్వ సభ్య సమావేశంలో ప్రజాప్రతినిధులు సూచించిన అంశాల పై అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని, దానికి సంబంధించిన సమాచారం సదరు ప్రజాప్రతినిధులకు అందించాలని సూచించారు. కరోనా వ్యాక్సినేషన్ ప్రతి ఒక్కరు తీసుకునేలా ప్రజాప్రతినిధులు చర్యలు తీసుకోవాలని తెలిపారు. *ప్రజలు స్వచ్చందంగా ముందుకు వచ్చి కరోనా వ్యాక్సినేషన్ 2 డోసులు తీసుకోవాలని , దాని వల్ల ఆరొగ్యానికి ఎలాంటి హని జరగదని, అనవసరపు అపోహలు సృష్టించవద్దని తెలిపారు*
అదనపు కలెక్టర్ (లోకల్ బాడీస్) కుమార్ దీపక్ ,జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రఘువీర్ సింగ్, జడ్పీ సీఈఒ శ్రీనివాస్, డి ఆర్ డి ఓ శ్రీధర్ జిల్లా అధికారులు జెడ్పీటీసీలు, ఎంపీపీలు ,సంబంధిత అధికారులు తదితరులు, ప్రజా ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.