అగ్నిధార న్యూస్ ,పెద్దపల్లి:

తెలంగాణ రాష్ట్రంలో 41600 స్కూల్ లలో సుమారు 5 4201 పైగా మధ్యాహ్న భోజన వంట కార్మికులు 28 లక్షలకు పైగా విద్యార్థులకు ఆహారాన్ని అందిస్తూ తమ వీధుల్లో నిర్వహిస్తున్నారు రెండు దశాబ్దాలుగా అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ఈ పథకం నిరాటంకంగా కొనసాగేందుకు ఎన్నో వ్యయప్రయాసలకోర్చి విద్యార్థులకు సకాలంలో ఆహారాన్ని అందిస్తున్న వంట కార్మికులకు శ్రమకు తగ్గ ఫలితం మాత్రం అందటం లేదు పథకం ప్రారంభం నుండి ఈ పని చేస్తున్నా కార్మికుల కు అతి తక్కువ గౌరవ వేతనం 500 రూపాయలు నుండి వెయ్యి రూపాయలు పొందుతున్నారు కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ రెండు ప్రభుత్వాలు మారిన వీరి తలరాతలు మారకపోగా ధరల పెరుగుదలతో మరింత కష్టాల్లో కూరుకుపోతున్నారు  పెరిగిన నిత్యవసర వస్తువులు కూరగాయలు కట్టెలతో మెస్ ఛార్జీలు ఏమాత్రం సరిపోవడం లేదు చాలా పాఠశాలలో వంటశాలలు నీటి సౌకర్యం లేకపోవడంతో కార్మికులు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు సమస్యలను సహృదయంతో పరిశీలించి తక్షణం పరిశీలించాలని  ఈ సందర్భంగా డిమాండ్స్ తో కూడిన వినతి పత్రాన్ని మంత్రి సబితా ఇంద్రారెడ్డికి అందించారు
వంట కార్మికులకు కనీస వేతనం 18000 శ్రమకు తగిన ఫలితం ఇవ్వాలి 45 :46 ఇండియన్ లేబర్ కాన్ఫరెన్స్ సిఫారసుల మేరకు వంట కార్మికుల ను వర్కర్లుగా గుర్తించాలి వేసవి సెలవుల తో నిమిత్తం లేకుండా 12 నెలల జీతం ఇవ్వాలి సామాజిక భద్రత ప్రయోజన లైనా గ్రాట్యుటీ పిఎఫ్ ఈ ఎస్ఐలతో పాటు పింఛన్ 10000 రూ ఇవ్వాలి మధ్యాహ్నం భోజన కార్మికులను 4క్లాస్ ఉద్యోగులుగా గుర్తించాలి పనిలో నియమించుకునే ఉత్తర్వులతో పాటు గుర్తింపు కార్డులు ఇవ్వాలి వీరిని అర్ధాంతరంగా తొలగించరాదు కార్మికులకు వైద్య బీమా సౌకర్యం ఐదు లక్షలు చెల్లించాలి ప్రతి నెల మెస్ బిల్లులు ఐదో తారీఖు లోపు చెల్లించాలి మధ్యాహ్న భోజనానికి చెల్లించే బడ్జెట్ నిధులు పెంచాలన్నారు ఈ కార్యక్రమంలో  ఏఐటియుసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సి వి ఎస్ బోస్ పావని కడారి సునీల్ పూసల రమేష్ సుగుణ తదితరులు పాల్గొన్నారు