అగ్నిధార న్యూస్, ముత్తారం:
దీర్ఘకాలిక ఋణాల చెక్కులు అందజేత
ముత్తారం మండలానికి చెందిన రెైతులకు దీర్ఘకాలిక ఋణాల చెక్కులను గురువారం లబ్దిదారులకు అందజేశారు. వ్యవసాయ అవసర నిమిత్తం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ముత్తారం కార్యాలయంలో దీర్ఘ కాలిక ఋణం కోసం దరఖాస్తు చేసుకోగా అట్టి మంజూరైన చెక్కులను సంఘం కార్యాలయంలో లబ్ధిదారులు అల్లాడి శోభ రూ,,5,40,000, అత్తె సుమలత రూ 6,00,000, కందుల శ్రీనివాస్ రూ,,6,00,000 ల చెక్కులను వారికి సింగిల్ విండో చైర్మన్ &కెడిసిసి బ్యాంక్ జిల్లా డైరెక్టర్ శ్రీ గుజ్జుల రాజిరెడ్డి అందజేయడం జరిగినది, తదనంతరం వారు మాట్లాడుతూ వ్యవసాయ ఋణాలు కావల్సిన రెైతులు సంఘం కార్యాలయంలో సంప్రదించగలరని వారు కోరారు,ఈ కార్యక్రమంలో సీఈఓ శ్రీ దాసరి ప్రసాద్ , పాలక వర్గ సభ్యులు శ్రీ అల్లాడి యాదగిరి రావు , మాజీ ఎంపీపీ & రైతు బంధు సమితి అధ్యక్షులు శ్రీ అత్తే చంద్రమౌళి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ శ్రీ నంసాని సమ్మయ్య మరియు సిబ్బంది పాల్గొన్నారు
