ప్రజా పాలన -ఇందిరమ్మ రాజ్యం నిర్మించడమే లక్ష్యం…
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఫోకస్…
సరికొత్త సంప్రదాయానికి నాంది పలికిన నేతలు…
అగ్నిధారన్యూస్ (హైదరాబాద్ గాంధీభవన్)
–టిపిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ , తాను బాధ్యతలు తీసుకున్న తర్వాత పార్టీకి – నాయకులకు – కార్యకర్తలకు అనుసంధానముగా వ్యవహరిస్తున్నారు.
మహేష్ కుమార్ గౌడ్ పీసీసీ అధ్యక్షులుగా నిరంతరం కార్యకర్తలకు నాయకులకు అందుబాటులో ఉంటున్నారు.
అలాగే తనతో పాటు ప్రభుత్వంలోని మంత్రులు ఇప్పటి నుండి వారానికి రెండు రోజులు కాంగ్రెస్ పార్టీ గాంధీభవన్ ఆఫీస్ లో ఒక్కోరోజు ఒక మంత్రి అందుబాటులో ఉంటారని, ఉదయం 11.00 నుండి మధ్యాహ్నం 02.00 గంటలకు రోజుకు 3గంటలు, అందుబాటులో ఉంటారని బుధవారం ప్రారంభించనున్నారు
ఇక వారానికి రెండు రోజుల పాటు గాంధీ భవన్ కు మంత్రుల సందర్శన
ప్రజలు, కార్యకర్తలతో మంత్రుల ముఖాముఖి ..
ఆదివారం నాడు జరిగిన సీఎల్పీ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ లు చర్చించుకుని గాంధీ భవన్ లో మంత్రుల ముఖాముఖి షెడ్యూల్ ను ఖరారు చేశారు..

