అగ్నిధారన్యూస్ సుల్తానాబాద్
కర్రలతో దాడి చేసినందుకు ఇద్దరు నేరస్తులకు ఒక సంవత్సరం ఆరు నెలలు జైలు శిక్షతోపాటు 500 రూపాయల జరిమానా విధించినట్లు సుల్తానాబాద్ ఎస్సై శ్రావణ్ కుమార్ తెలిపారు. వివరాల్లోకి వెళితే సుల్తానాబాద్ పట్టణంలోని శాస్త్రి నగర్ కు చెందిన కలవల లక్ష్మయ్య, కల్వల వినీష్ లు రెండు వేల పద్దెనిమిది సంవత్సరంలో కాంపెల్లి శ్రీహితపై కర్రలతో దాడి చేయగా ఆమె ఫిర్యాదు చేయడంతో అప్పటి ఎస్సై రాజేష్ కేసు నమోదు చేయగా గురువారం రోజున సుల్తానాబాద్ జెఎఫ్సిఎం మెజిస్ట్రేట్ గణేష్ ఈ శిక్ష విధించినట్లు తెలిపారు.
