తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు.

తెలంగాణ ఐ టి శాఖ టాస్క్ సి ఓ ఓ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి.

అగ్నిధారన్యూస్ (కల్వకుర్తి) 

గత వారం రోజులుగా విదేశీ పర్యటనలో భాగంగా తెలంగాణ రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు రాబట్టుకు వస్తున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలంగాణ ఐటి శాఖ టాస్క్ సీఈఓ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి ఒక పత్రిక ప్రకటనలో కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణలో నిరుద్యోగుల ఉపాధి కల్పన కై వివిధ రకాల కంపెనీల కోసం 45,500 కోట్ల పెట్టుబడులకు సన్ మెట్రో కెమికల్స్ రాష్ట్ర ప్రభుత్వంతో ఎంఓయూ చేసుకుంది అన్నారు. ఇందులో భాగంగా ఆ కంపెనీ స్టోరేజ్ పవర్, సోలార్ పవర్ ప్రాజెక్ట్, చేపట్టనుంది అని అదేవిధంగా నిరుద్యోగుల కోసం ఉపాధి కల్పనకై రాష్ట్రంలో వివిధ కంపెనీలకు పెట్టుబడులు తీసుకురావడానికి కృషిచేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రాష్ట్ర నిరుద్యోగుల పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.