జిల్లా అధ్యక్షులు బూర్ల వంశి ఆధ్వర్యంలో ఘనంగా ఆవిష్కరణ.

రాష్ట్ర కార్యదర్శి చంద్రశేఖర్ రెడ్డి, ప్రచార కార్యదర్శి ఇంజన్ సాంబశివరావు, రాష్ట్ర కమిటీ సభ్యులు పూసాల కృష్ణ.

అగ్నిధారన్యూస్ పెద్దపల్లి : జాతీయ మానవ హక్కుల కమిటీ (ఎన్ హెచ్ ఆర్ సి) తెలంగాణ రాష్ట్ర కమిటీ క్యాలెండర్ను పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆవిష్కరించారు. ఎన్ హెచ్ ఆర్ సి పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు బూర్ల వంశి ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ సమాజ హితం కోసం నీతి నిజాయితీతో ప్రతి పౌరుడు బాధ్యతగా  వ్యవహరించినట్లయితే దేశం సుభిక్షంగా అభివృద్ధి పథంలో ముందు పోతుందని ఆయన అన్నారు. దేశం కోసం, రాష్ట్రం కోసం నిస్వార్ధంగా సేవలు చేసే వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని  పేర్కొన్నారు. అవినీతి రహిత సమాజం కోసం ఎన్ హెచ్ ఆర్ సి సంస్థ చేసే ముఖ్య ఉద్దేశాలను కమిటీ నాయకుల ద్వారా తెలుసుకుని వారిని అభినందించారు. అనంతరం జిల్లా సివిల్ సప్లై డిఎం శ్రీకాంత్, డిటిఓ కర్ణాకర్, మైనింగ్ ఏడి పి శ్రీనివాస్, డిస్ట్రిక్ట్ ఏవో శ్రీనివాస్, పెద్దపల్లి సిఐ ప్రవీణ్ తదితర అధికారులకు క్యాలెండర్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి ఓడేటి చంద్రశేఖర్ రెడ్డి, రాష్ట్ర ప్రచార కార్యదర్శి ఇంజన్ సాంబశివరావు, రాష్ట్ర కమిటీ సభ్యులు పూసాల కృష్ణ, జిల్లా ప్రధాన కార్యదర్శి కొత్త కమలాకర్, జిల్లా నాయకులు రాజ్యలక్ష్మి, నంబయ్య పెద్దపల్లి మండల అధ్యక్షులు హరిబాబు, కనకయ్య, మంథని, కమాన్పూర్, జూలపల్లి, రామగుండం, రామగిరి మండలాల అధ్యక్షులు పెయ్యాల రమేష్, తాటిపాముల శ్రీనివాస్, వడ్డాల తిరుపతి, ప్రదీప్, ఎస్ శ్రీనివాస్  నాయకులు సమీర్, బాబు రెడ్డి, పసొట్ శ్రీనివాస్, సబ్బు సతీష్ మాటూరి సంతోష్ పద్మలత తదితరులు పాల్గొని జిల్లా కేంద్రంలో ఘనంగా క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.