– జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి ఎం.కాళిందిని
అగ్నిధారన్యూస్ మంథని
మహిళా సంఘాల ద్వారా సౌర విద్యుత్ యూనిట్ల ఏర్పాటుకు అనువైన స్థలాలను పరిశీలించడం జరిగిందని జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి ఎం.కాళిందిని తెలిపారు. మంగళవారం జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి ఎం.కాళిందిని మంథని మండలంలోని ఎక్లాస్పూర్, సిరిపురం, గుంజపడుగు గ్రామాలలో సౌర విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు చేయుటకు అనువైన ప్రభుత్వ స్థలాలను పరిశీలించారు.
ఈ సందర్భంగా జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి ఎం.కాళిందిని మాట్లాడుతూ….
ప్రధాన మంత్రి కిసాన్ ఉర్జా సురక్ష ఏవం ఉత్తన్ మహాభియాన్ స్కీమ్ లో మహిళల ఆర్థిక స్థితి పెంపొందించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం పైలెట్ ప్రాజెక్ట్ కింద ప్రతి జిల్లాకు 2 మెగావాట్ల సోలార్ ప్లాంట్లను మహిళా సంఘాల ద్వారా డిఆర్డిఏ, టిజిరెడ్-కో టిజి ట్రాన్స్కో భాగస్వామ్యం తో ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు. అందులో భాగంగా మంగళవారం జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మంథని మండలంలోని ఎక్లాస్పూర్, సిరిపురం గుంజపడుగు గ్రామాలలో ప్రభుత్వ భూములు పరిశీలించామని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమం లో ఎంపిడిఓ, రెవెన్యూ , రెడ్ కో, ట్రాన్స్ కో డిఆర్డిఏ సిబ్బంది పాల్గొన్నారు.


