పట్టణంలో ప్రభంజనం సృష్టించిన నోబెల్ పాఠశాల.

వంద శాతం విద్యార్థుల ఉత్తీర్ణత.

పట్టణంలో రెండవ స్థానంలో నిలిచిన నోబెల్ పాఠశాల.

కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ఫలితాలు.

పాఠశాల కరస్పాండెంట్ మోహనరాజా.

అగ్నిధారన్యూస్ పెద్దపల్లి జిల్లా
రాష్ట్రవ్యాప్తంగా బుధవారం వెలుబడిన పదవ తరగతి ఫలితాల్లో పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి మండలం పెద్దకల్వల గ్రామంలో గల నోబెల్ ఉన్నత పాఠశాలలో వంద శాతం ఉత్తీర్ణత సాధించినట్లు నోబెల్ పాఠశాల కరస్పాండెంట్ ఎర్రోజు మోహనరాజా తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విద్యార్థుల అభినందన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ… కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా వంద కు వంద శాతం ఉత్తీర్ణత సాధించడం సంతోషంగా ఉంది అన్నారు. ఉపాధ్యాయుల నిరంతర కృషి విద్యార్థుల పట్టుదల. ఒక్కొక్క విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తూ, ఒక పటిష్టమైన ప్రణాళికతో, నిరంతరం విద్యార్థులను పర్యవేక్షిస్తూ పరీక్షలు నిర్వహిస్తూ వార్షిక పరీక్షలకు సన్నద్ధం చేయడం వల్లనే అద్భుత ఫలితాలను సాధించడం సాధ్యమైందని అన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులు, (పి అంజలి 581 మార్కులు,) (పి రస్మిత 579 మార్కులు,) ( పౌజియా 576 మార్కులు ) లను కరస్పాండెంట్ మోహనరాజ, ప్రధానోపాధ్యాయురాలు ప్రణీత పాఠశాల ఉపాధ్యాయులు అభినందించారు. నిరంతరం విద్యార్థుల పురోగతిని పర్యవేక్షిస్తూ పది ఫలితాల్లో, పెద్దపల్లి పట్టణంలో రెండవ స్థానాన్ని కైవసం చేసుకుని.570పైన మార్కులతో.05
550 పైన మార్కులతో.21
500 పైన మార్కులతో.35 విద్యార్థు ల నోబెల్ పాఠశాల ప్రభంజనం సృష్టించింది అన్నారు. ఉత్తమ ఫలితాలు సాధించేలా కృషి చేసిన ఉపాధ్యాయ బృందాన్ని… సహకరించిన తల్లిదండ్రులని, పాఠశాల యాజమాన్యం అభినందించారు.