వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు చంటి ముదిరాజ్

అగ్నిధారన్యూస్ హైదరాబాద్

సమాచార హక్కు చట్టం సాధన కమిటీ ప్రతి ఒక్క సభ్యుల కృషి ఫలితమే సమాచార ప్రధాన కమిషనర్ ను నియమించడం అని  సమాచార హక్కు చట్టం సాధన కమిటీ  వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు చంటి ముదిరాజ్ తెలిపారు. ఈ మేరకు సోమవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కులకు పత్రికా ప్రకటన ద్వారా ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. నిరంతరం ప్రజల హక్కులకై నిరంతరం పోరాటం చేస్తూ పలుమార్లు పత్రిక సమావేశాలు మంత్రులకు రిప్రజెంటేషన్లు, ఇవ్వడం మూలంగానే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి తెలంగాణ రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్ గా చంద్రశేఖర్ రెడ్డిని నియమించింది అన్నారు. ప్రజల హక్కులను పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో హక్కుల పరిరక్షణకు పాటుపడాలన్నారు. ఈ కార్యక్రమంలోతెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు సూర స్రవంతి,రాష్ట ప్రధాన కార్యదర్శి మల్లం వెంకటేశం, తదితరులు పాల్గొన్నారు.