అభివృద్ధి పనుల్లో నాణ్యత పాటించాలి.
మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేష్.
అగ్నిధారన్యూస్ పెద్దపల్లి టౌన్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం టి యు ఎస్ ఐ డి సి నిధులు 5 కోట్ల రూపాయలతో పేద్దపల్లి పట్టణంలో అన్ని వార్డుల్లో సిసి రోడ్లు,మురికి కాలువలు,ప్రభుత్వ కార్యాలయల ప్రహరీ గోడలు అభివృద్ధి పనులను పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు ఆదేశాల మేరకు సోమవారం మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేష్ పరిశీలించారు ఈసందర్భంగా మాట్లాడుతూ.. కమిషనర్ పలు వార్డుల్లో ప్రజల సమస్యల సౌకర్యార్థం ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది అన్నారు. గుత్తేదారులు పనుల్లో వేగం పెంచాలని అన్నారు.సీసీ రోడ్లు పూర్తి అయిన తరువాత 21 రోజులు రోడ్లపై మట్టితో కట్టలు కట్టి నీరు నిల్వ ఉంచాలని అన్నారు. పట్టణంలోని పలు వార్డులో పెండింగ్ ఉన్న అభివృద్ధి పనులు త్వరలోనే పూర్తి చేస్తామని అన్నారు. వేసవి కాలం దృష్ట్యా పట్టణ ప్రజలు మంచినీటిని వృధా చెయ్యకుండా పొదుపుగా వాడుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేసారు. పట్టణంలోని వార్డులలో ఏమైనా సమస్యలు ఉన్నట్లయితే మున్సిపల్ టోల్ ఫ్రీ నంబర్ 63031 27484 కాల్ చెసినట్లయితే మీ సమస్యలు పరిష్కరించడం జరుగుతుందని అన్నారు. అమృత్ 2 ద్వార అమర్ నగర్ నుండి ఆర్డీఓ ఆఫీస్ వరకు నిర్మిస్తున్న మంచినీటి పైపు లైన్ పనులను త్వరగా పూర్తి చేయాలని అన్నారు. ఈకార్యక్రమంలో మున్సిపల్ ఏఈ సతీష్,వర్క్ ఇన్స్పెక్టర్లు అనిల్,వాణి వార్డు ఆఫీసర్లు శ్రీనివాస్,అరవింద్,యశ్వంత్,సంజీవ్ మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

