రోడ్డు వేసేది ఎప్పుడు..?..కనీసం మరమత్తులైన ఉన్నాయా..?

చిన్న పాటి వర్షానికే రోడ్డంతా బురద మయం

ముత్తారం మండల కేంద్రంలోని ప్రధాన కూడలి దుస్థితి

అగ్నిధారన్యూస్ మంథని : 

నిత్యం వాహనదారులతో రద్దీగా ఉండే ప్రధాన కూడలి చిన్న వర్షం కురవగానే గుంతలలో నీరు నిలచి వాహనదారులకు ప్రమాదకరంగా మారింది. పెద్దపల్లి జిల్లా ముత్తారం (మంథని) మండల కేంద్రంలోని ప్రధాన చౌరస్తా వద్ద రోడ్డు చిన్న చినుకు పడితే బురదతో గుంతలు ఏర్పడి ఈ ప్రాంతంలో తిరిగే వ్యక్తి కాకుండా బయటి వ్యక్తి ఈ మార్గం గుండా ప్రయాణిస్తే ప్రమాదాల బారిన పడే అవకాశం లేక పోలేదు.

చినుకు పడితే బురద – చినుకు పడకుంటే దుమ్ము

మంథని మండల కేంద్రం నుండి , గోదావరిఖని వయా బేగంపేట్ నుండి ముత్తారం మండల కేంద్రంలోని ఓడెడ్ , అడవి శ్రీరాంపూర్ గ్రామాలకు వెళ్ళాలన్న ఈ ముత్తారం మండల ప్రధాన కూడలి నుండే వెళ్ళాలి. ఈ మండల పరిధిలోని ఖమ్మంపల్లి , అడవి శ్రీరాంపూర్ గ్రామాన్ని ఆనుకొని ఉన్న మానేరు ఒడ్డున ఇసుక క్వారీలు ఉండటంతో భారీ వాహనాలు అధిక ఓవర్ లోడ్ తో ఇసుక క్వారీ నుండి ఇసుక తరలింపు వలన అడవి శ్రీరాంపూర్ , ముత్తారం , కాసర్ల గడ్డ , ధర్యాపూర్ , గాజులపల్లి ప్రభావిత గ్రామాలు  దుమ్ము ధూళి తో రోడ్డు ప్రక్కల ఇరు వైపుల ఉన్న నివాస కుటుంబాలు అనారోగ్యానికి గురైన , భారీ వాహనాలు నడిచి పెద్ద పెద్ద గుంతలు ఏర్పడిన అర్ అండ్ బీ శాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగా  గుంతలు పూడ్చక పోవడంతో ఈ వర్షాకాలంలో  చిన్న చినుకు పడితే రోడ్డుపై ఎక్కడికక్కడ గుంతలలో నీళ్ళు నిలచి ఉండటంతో ఈ ప్రధాన మార్గం గుండా ప్రయాణికులు ప్రయాణించాలి అంటేనే భయపడుతూ సంబంధిత అర్ అండ్ బీ శాఖ యొక్క జిల్లా అధికారులు వెంటనే గుంతల రోడ్డును మరమత్తులు చేసేలా చూడాలని ప్రభావిత గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.