ఎన్నికల లబ్ధి కోసమే శంకుస్థాపనలు.
మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్.
కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు 42 శాతం బీసీలకు రిజర్వేషన్ అమలు చేసి ఎన్నికలకు పోవాలి.
అగ్ని ధార న్యూస్ (కల్వకుర్తి)
రైతు వ్యతిరేక ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అని మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ విమర్శించారు శనివారం కల్వకుర్తి పట్టణంలోని వారి నివాసంలో పత్రికా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత బిఆర్ఎస్ ప్రభుత్వంలోని కల్వకుర్తి నియోజకవర్గంలో గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో మాజీ మంత్రి హరీష్ రావు కల్వకుర్తి పట్టణంలో 100 పడకల ఆసుపత్రి నిర్మాణానికి అదేవిధంగా ఆమనగల్ పట్టణ కేంద్రంలో 50 పడుకల ఆసుపత్రి నిర్మాణానికి మాజీమంత్రి హరీష్ రావు శంకుస్థాపనలు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. రానున్న ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు ప్రజలను అధికార కాంగ్రెస్ పార్టీ మభ్యపెడుతుందన్నారు. రైతులకు పూర్తిస్థాయిలో రుణమాఫీ చేయకుండా రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందని మండిపడ్డారు రైతులకు 55 కోట్ల చేయాల్సిన రుణమాఫీని 19 కోట్ల రుణమాఫీ చేసి చేతులు దులుపుకుందని పేర్కొన్నారు. ఎన్నికల్లో రైతులకు ఇచ్చిన రైతు భరోసా 15 వేల హామీ ఏమైందని ప్రశ్నించారు. గ్రామాల్లో గత ప్రభుత్వం చేపట్టిన పల్లె ప్రగతి హరితహారం కార్యక్రమాలు నేటి కాంగ్రెస్ ప్రభుత్వంలో గాలికి వదిలేసిందని తీవ్రంగా మండిపడ్డారు కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో రైతులకు రాయితీ పై యూరియా సరపర చేయలేని స్థితిలో రేవంత్ సర్కార్ ఉందని దువ్వే పట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% ఎస్సీలకు 18/. శాతం రిజర్వేషన్ ఎస్టీలకు 10% రిజర్వేషన్ కల్పించి ఎన్నికలకు పోవాలని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులకు బకాయి పడ్డ 50వేల కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కెసిఆర్ పాలనలో దళితుల సంక్షేమం కోసం ప్రతిష్టాత్మకంగా అమలు చేసిన దళిత బంధు పథకం నేటి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏ ఒక్క దళితునికి వచ్చిందా అని ప్రశ్నించారు. బిఆర్ఎస్ పార్టీ దశాబ్ద పాలనలో ప్రతి జిల్లాలో సమీకృత కార్యాలయాలు మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసిన ఘనత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు దక్కిందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ దుష్య పరిపాలను అంతం చేస్తామని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ఈ సమావేశంలో కల్వకుర్తి మున్సిపాలిటీ మాజీ చైర్మన్ ఎడమ సత్యం, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సింగం విజయ్ గౌడ్, మాజీ వైస్ ఎంపీపీ గోవర్ధన్ మాజీ కౌన్సిలర్ కార్మిక సంఘం అధ్యక్షుడు సూర్యప్రకాశ్ రావు,మాజీ కౌన్సిలర్ లు సైదులు గౌడ్, మనోహర్ రెడ్డి, సర్పంచుల సంఘం మాజీ అధ్యక్షుడు జంగయ్య నాయకులు తాహెర్ అలీ, భగత్ సింగ్, సురేష్ గౌడ్, చిన్న,రామకృష్ణ,బి ఆర్ ఎస్ యువజన విభాగం మండల అధ్యక్షుడు వట్టేపు కిషోర్, తదితరులు పాల్గొన్నారు.
