డీఈవో ను మర్యాదపూర్వకంగా  కలిసిన అజిలాపూర్ గ్రామ నాయకులు.

అగ్నిధారన్యూస్ (కల్వకుర్తి)

వెల్దండ మండలం అజిలాపూర్ గ్రామంలో ప్రభుత్వ పాఠశాలకు ఉపాధ్యాయులను నియమించాలని గ్రామస్తులు ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు బుధవారం నాగర్ కర్నూల్ లో  జిల్లా విద్యాధికారి రమేష్ ను  కలిశారు. అజిలాపూర్ గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో ఈ ఏడాది నుంచి 8వ తరగతి కి అప్ గ్రేడ్  చేయడం జరిగిందన్నారు. దీంతో విద్యాబోధన కోసం తెలుగు, ఇంగ్లీష్, సైన్స్, హిందీ సబ్జెక్టులకు టీచర్స్ లేకపోవడంతో విద్యార్థులకు తీవ్ర నష్టం జరుగుతుందని, వెంటనే నలుగురు ఉపాధ్యాయులను నియమించాలని కోరారు. ఈ మేరకు డీఈవో రమేష్ కు వినతిపత్రాన్ని అందజేశారు. స్పందించిన డీఈవో పాఠశాలను సందర్శించి  ఉపాధ్యాయులను ఖచ్చితంగా కేటాయిస్తా అన్నారు. ఈ కార్యక్రమంలో, పాఠశాల చైర్మన్ కేశమౌని పద్మ, గ్రామస్తులు బి ఆర్ ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు సిద్ధగోని రమేష్ గౌడ్, కేశమౌని కృష్ణయ్య గౌడ్, కొప్పు కృష్ణయ్య, కుర్పూర్ కుమార్, కొప్పుల రామస్వామి, కొప్పుల యాదయ్య,వెంకటయ్య జంగయ్య తదితరులు ఉన్నారు.