పోలీసుల విస్తృత తనిఖీలు.

వరుసగా బయటపడుతున్న ఇసుక డంపులు.

ఇసుక మాఫియా బరితెగింపు.

ఇసుక మాఫియా ఆట కట్టిస్తున్న పోలీసులు, రెవెన్యూ అధికారులు.

అగ్నిధారన్యూస్ మంథని క్రైమ్: 

పెద్దపల్లి జిల్లా మంథని మండలంలో ఒక్కొక్కటిగా బయట పడుతున్న ఇసుక అక్రమ డంప్ యాడ్లు.ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల పేరుతో.. అక్రమంగా ఇసుకను తరలిస్తున్న మాఫియాకు  సహకరిస్తున్న వారు ఎవరూ..? అనే ప్రశ్న ఇప్పుడు మంథని మండలం అంతటా చర్చనీయాంశంగా మారింది. ఈ మాఫియాకు  బడా నాయకుల అండ ఉందా..? లేక అధికారుల కనుసన్నల్లోనే ఈ రవాణ జరుగుతుందా..? అనే ప్రశ్న చర్చనీయాంశంగా మారింది. మంగళవారం  మండలంలోని నాగారం గ్రామంలో 20 ట్రాక్టర్ ట్రిప్పుల  అక్రమంగా ఇసుక నిలువలను గుర్తించిన పోలీసులు, రెవెన్యూ అధికారులకు అప్పగించి రెండు రోజులు గడవనే లేదు మళ్ళీ ఒక అక్రమంగా నిలువ ఉంచిన ఇసుక డంప్ యాడ్ కుచిరాజ్ పల్లి గ్రామంలో వెలుగులోకి వచ్చింది. పర్మిషన్ క్వారీతో సంబంధం లేకుండా గోదావరిలో ఇసుకను తోడేస్తున్న ఇసుక మాఫియా తోడేళ్లను అధికారులు,ఎందుకు కట్టడి చేయలేకపోతున్నారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.  కుచిరాజ్ పల్లిలో ఉన్న ఇసుక డంప్ యార్డ్ ని మంథని ఎస్ఐ డేగ రమేష్ స్వాధీన పరుచుకొని రెవెన్యూ అధికారులకు అప్పగించారు. మండలంలో అక్రమంగా ఇసుక తరలింపు చేస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్ ఐ  హెచ్చరించిన ఇసుక మాఫియా  పెడ చెవిన పెడుతూ,మా పని మేం చేసుకుంటూ పోతాం అనే విధంగా అక్రమ దందాకు తెర లేపుతున్నారు. మండలంలో విస్తృత తనిఖీలు చేపట్టినట్లయితే మరిన్ని అక్రమ ఇసుక నిలువల యార్డులు బయటపడే అవకాశం లేకపోలేదు. అక్రమ ఇసుక మాఫియాకు మండలంలో అధికారులు అడ్డుకట్ట వేస్తారా లేదా వేచి చూడాలి.