ఆసుపత్రి వర్గాలకు ఒక్కసారిగా దడ పుట్టించిన ఎమ్మెల్యే.
అన్ని విభాగాలను పరిశీలించిన ఎమ్మెల్యే.
అగ్నిధార న్యూస్ గోదావరిఖని టౌన్ ఆగష్టు 28
గోదావరిఖని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని రామగుండం శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. దీంతో ఆసుపత్రి వర్గాలు ఒక్కసారిగా హడలిపోయాయి. ఆసుపత్రిలో ఉన్న అన్ని విభాగాలను ఆయన పరిశీలించారు. వివిధ విభాగాలలో ఉన్న పేషంట్లను కలిసి వారి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా వైద్యం ఏ విధంగా అందుతుందని పర్యవేక్షించారు. దీంతో ఆసుపత్రి వర్గాలు ఒక్కసారిగా చెమటలు కక్కుకున్నాయి. ఆసుపత్రి రెసిడెన్షియల్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రాజు వెంటనే ఎమ్మెల్యేను కలిసి అన్ని విభాగాలను చూపించారు. ఆస్పత్రి లో ఉన్న పరిస్థితులను ఎమ్మెల్యే కు వివరించారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వ హయాంలో ఏ ఒక్కరికి వైద్యపరంగా ఇబ్బందులు ఉండకూడదని ఖరాఖండిగా వైద్యులకు సూచించారు. 24 గంటలు వైద్య సేవలు అందించాలని వైద్యులకు, ఆసుపత్రి సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. అనంతరం కొత్తగా నిర్మాణం జరుగుతున్న ఆసుపత్రి భవన నిర్మాణాలను పరిశీలించారు. పూర్తి నాణ్యతతో నిర్మాణపు పనులు జరగాలని సదరు కాంట్రాక్టర్లను ఆదేశించారు. ఎక్కడ ఎలాంటి జాప్యం జరిగిన… లోపాలు జరిగిన ఊరుకునేది లేదని హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా పాలనలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఉండకూడదని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ కార్పొరేటర్లు వివిధ విభాగాల అధ్యక్షులు ఉన్నారు.