• అమ్మకాలు సరే… అనుమతుల జాడేది..
• కొనుగోలుదారులకు బురిడీ..
• ప్రభుత్వ ఆదాయానికి గండి
• కొనుగోలుదారులను దగా చేస్తున్న రియాల్టర్, మధ్య దళారులు.
• అక్రమ వెంచర్ లో నిబంధనలు ఉష్ కాకీ.
• నిబంధనలు ఏం చెబుతున్నాయి..!
చేగొండ రవికుమార్ యాదవ్….
అగ్నిధారన్యూస్ పెద్దపల్లి పెద్దపల్లి జిల్లాలో అడ్డు అదుపు లేకుండా పూటకో వెంచర్ పుట్టుకొస్తుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారులు అక్రమ లే అవుట్లతో చెలరేగిపోతున్నారు. అనుమతులు లేకుండానే వ్యవసాయ భూములను వెంచర్లగా మార్చి యధేచ్చగా విక్రయాలు సాగిస్తున్నారు. పెద్దపల్లి జిల్లాలో గత ఐదు సంవత్సరాలలో జిల్లా వ్యాప్తంగా పట్టణ ప్రాంతాలు మినహాయిస్తే. డిటిసిపి అనుమతులు పొందిన మొత్తం వెంచర్లు 20 లోపే ఉన్నాయి. వెంచర్ లో ఎర్ర మట్టి మొరం తో స్వల్పంగా రోడ్లు వేసి, మధ్య దళారులను రంగంలోకి దింపి కొనుగోలుదారులను ఆకర్షించేందుకు రియల్ ఎస్టేట్ వ్యాపారులు కొత్త తరహా మోసాలకు తెరలేపుతున్నారు. మాది పాత వెంచర్ అంటూ కొనుగోలుదారులకు అంటగడుతూ దగా చేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా గత కొద్దికాలంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం పడిపోయింది. అయినప్పటికీ, కొంతమంది అక్రమార్కులు అక్రమ వెంచర్ ను ఏర్పాటు చేస్తున్నారు. కేవలం నాలా కన్వర్షన్ అనుమతులు తీసుకొని అన్ని అనుమతులు ఉన్నాయని కొలుగోలుదారులను బురిడీ కొట్టిస్తున్నారు. వ్యవసాయ భూమిని కొనుగులు చేసి, ప్లాట్లుగా మార్చి, ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నాడు. మరికొందరైతే నాలా కన్వర్షన్ కూడా చేయకుండానే వ్యవసాయ భూములను వ్యవసాయేతర భూములుగా మారుస్తున్నారు. ప్లాట్లుగా విక్రయిస్తున్నారు. గ్రామపంచాయతీ నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోవడం లేదు. రియల్ ఎస్టేట్ చేయాలంటే డిటిసిపి అనుమతులు తప్పని సరిగా ఉండాలి. కానీ జిల్లాలో డిటిసిపి అనుమతులు పొందిన వెంచర్లు కానరావడం లేదు. ఎలాంటి అనుమతులు లేని వెంచర్ లో ప్లాట్లు కొనుగోలు చేసిన కొనుగోలుదారులు ఇండ్లు కట్టుకోవాలన్నా, బ్యాంక్ రుణాలు, ఇతర వసతులు కావాలన్నా అనుమతి పత్రాలు తప్ప కుండా జతచేయాల్సి ఉంటుంది. ఇక్కడ అవేమీ కనిపించవు. అంత మోసం.. దగా.. రియాల్టర్, మధ్య దళారులు ఆడిందే ఆట.. పాడిందే పాట అన్న చందంగా ఉంది. కొనుగోలుదారులకు భవిష్యత్తులో ఎన్ని ఇబ్బందులు ఎదురైతే మాకేంటీ…? ప్లాట్లు అమ్ముడు పోవాలి.. మా లాభం మాకు వస్తే చాలు.. అంటూ చేతులు దులుపుకుంటున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం అంటేనే మోసం.. దగా అన్న చందంగా తయారయింది. అక్రమ వెంచర్ లో ప్లాట్లు కొనుగోలు చేసిన వారికి రియల్ మోసం తప్పడం లేదు. అది అక్రమ లేఅవుట్ అని రియాల్టర్, మధ్య దళారులకు తెలుసు. కానీ కొనుగోలుదారులకు తెలియదు. పై పై మెరుగులు అద్ది మాది అనుమతితో కూడిన వెంచర్ అంటూ కొనుగోలుదారులను నిండా మునిగేలా చేస్తున్నారు.
అనుమతులు లేకుండానే…
నాలా (నాన్ అగ్రికల్చరల్ లాండ్స్ అసెస్‌మెంట్ యాక్ట్) చట్టం-2006 ప్రకారం నాలా చట్టాన్ని అనుసరించి వ్యవసాయ భూములను వ్యవసాయేతర పనులకు ఉపయోగిస్తే ఏక మొత్తంలో ఒకేసారి కన్వర్షన్ చార్జీల ను భూమి విలువపై 3 శాతం ప్రభుత్వానికి చెల్లిం చాల్సి ఉంటుంది. కన్వర్షన్ అనంతరం భూమిని ప్లాట్లుగా మార్చి విక్రయించాలంటే డీటీసీపీ(డైరెక్టరేట్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్) అనుమతి తప్పనిసరి. ఎకరం (40 గుంటలు) స్థలంలో డీటీసీపీ అనుమతికి వెళ్తే 12 శాతం ఓపెన్ స్థలం (9 శాతం గ్రీనరీ, 1 శాతం వాటర్ ట్యాంక్, సెప్టిక్ ట్యాంకులు, 1 శాతం వాణిజ్య అవసరాలు, 1 శాతం హెల్త్ సెంటర్, పాఠశాల) కోసం స్థలం కేటాయించాల్సి ఉంటుంది. నిర్ధేశించిన వెడల్పుతో రోడ్లకు స్థలం పోగా ఎకరానికి 24 గుంటలు మాత్ర మే ప్లాట్ల స్థలం మిగులుతుంది. అంతర్గత రోడ్లు 30 ఫీట్ల వెడల్పు, మేయిన్ రోడ్లు, అప్రోచ్ రోడ్లు కనీసం 40 ఫీట్ల వెడల్పుతో ఉండాలనే నిబంధనలు ఉన్నాయి. డీటీసీపీ అనుమతి కోసం బెటర్మెంట్, డెవలప్ మెంట్ చార్జీల పేరిట భూమి విలువకు అనుగుణంగా ప్రభుత్వానికి ఫీజులు చెల్లించాలి. రెండున్నర ఎకరాల వరకు జిల్లా టౌన్ ఆండ్ కంట్రీ ప్లానింగ్ ఆఫీసర్ నుంచి లేఅవుట్ అనుమతి పొందాల్సి ఉంటుంటి.
వసతులు ఉస్ కాకీ…
డీటీసీపీ లే అవుట్ వెంచర్‌లలో అన్ని రకాల వసతు లైన 33 ఫీట్ల రోడ్డు, బీటీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, ప్రహారీ, వాటర్ పైప్‌లైన్, సంప్, ఎలక్ర్టిసిటీ, వీధి లైట్లు, ఓపెన్ జిమ్, వాలీబాల్, షటీల్ కోర్టులు, పార్కు, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, రోడ్డుకు ఇరువైపుల చెట్లు, స్పాట్ రిజిస్ర్టేషన్ వంటి సౌకర్యాలు వెంచర్లలో కల్పించాలి. ఇలాంటి సౌకర్యాలు వెంచర్‌లలో ఉంటేనే ప్లాట్లు విక్రయించాలి. ఎక్కడ పై నిబంధనలు అమలు కావడం లేదు. 20 ఫిట్లు రోడ్లు వేసి, ఫేక్ పత్రాలు చూపుతూ ప్లాట్లను అమాయకులకు అంట గడుతూ రియల్టర్లు మోసాలు చేస్తూ చేతులు దులుపుకుంటున్నారు అనే ఆరోపణలు ఉన్నాయి.