లాటరీ ద్వారా మద్యం షాపుల కేటాయింపు
స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జే. అరుణ శ్రీ
అగ్నిధారన్యూస్ పెద్దపల్లి , అక్టోబర్ 27:
రెండు సంవత్సరాల కాల పరిమితికి గాను జిల్లాకు కేటాయించిన 74 మద్యం షాపులు దరఖాస్తు చేసుకున్న వారికి లాటరీ పద్ధతిలో కేటాయించడానికి చివరి అంకం ముగిసింది. పెద్దపల్లి పట్టణం బంధం పల్లి లో
లాటరీ పద్దతి ద్వారా పారదర్శకంగా మద్యం షాపుల కేటాయింపు ప్రక్రియ స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జే. అరుణ శ్రీ సమక్షంలో జరిగింది.
సోమవారం బంధంపల్లిలోని స్వరూప గార్డెన్స్ లో నిర్వహించిన మద్యం (ఏ4) షాపుల కేటాయింపు ప్రక్రియలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జే. అరుణ శ్రీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అరుణశ్రీ మాట్లాడుతూ…. జిల్లాలో ఉన్న 74 ఏ4 మద్యం షాపుల్లో ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల మేరకు గౌడ కులస్థులకు 13 షాపులు, ఎస్సీలకు 8 షాపులు రిజర్వేషన్ తో పాటు మరో 53 జనరల్ మొత్తం 74 షాపులను లాటరీ ద్వారా దరఖాస్తుదారులకు కేటాయించామని తెలిపారు.
జిల్లాలో ఉన్న 74 ఏ4 మద్యం షాపులకు 1507 దరఖాస్తులు వచ్చాయని, దరఖాస్తుదారుల సమక్షంలో పారదర్శకంగా లాటరీ పద్ధతిన మద్యం షాపుల కేటాయింపు జరిగిందని అన్నారు. మద్యం షాపుల కేటాయింపు మొత్తం ప్రక్రియను దరఖాస్తుదారుల మీడియా సమక్షంలో వీడియోగ్రఫీ చేయడం జరిగిందని తెలిపారు.మద్యం షాపులను దక్కించుకున్నవారు, ప్రభుత్వం నిర్దేశించిన ఎక్సైజ్ టాక్స్ వార్షిక పన్నులో 6వ వంతు వెంటనే చెల్లించి కన్ఫర్మేషన్ లెటర్ తీసుకోవాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ మహిపాల్ రెడ్డి, ఎక్సైజ్ సీఐ నాగేశ్వరరావు దరఖాస్తు దారులు, ఎక్సైజ్ శాఖ సిబ్బంది, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గోన్నారు.








