అగ్నిధార న్యూస్ ,పెద్దపల్లి:

వరిదాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే దాసరి

పెద్దపల్లి మండలం రాఘవపురం రంగాపూర్ బ్రాహ్మణపల్లి గ్రామలలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను మంగళవారం రోజున ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ రైతులందరూ కొనుగోలు కేంద్రాలకు ధాన్యాలను తీసుకు వచ్చి వరి ధాన్యానికి మద్దతు ధర పొందాలని సూచించారు రైతులకు కేంద్రాల వద్ద ఎలాంటి అసౌకర్యాలు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు ఈ కార్యక్రమంలో రాఘవపురం రంగాపురం  బ్రాహ్మణపల్లి  గ్రామాలలోని అధికారులు ప్రజా ప్రతినిధులు రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఎమ్మెల్యే వెంట ఎంపీపీ బండారి స్రవంతి-శ్రీనివాస్,జడ్పీటీసీ బండారి రామ్మూర్తి, PACS ఛైర్మెన్ దాసరి చంద్రారెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు మార్కు లక్ష్మణ్, రైతు సమన్వయ సమితి మండలాధ్యక్షులు అనంత రెడ్డి గ్రామ సర్పంచ్ గంట లావణ్య-రమేష్, వెంకటేశం మల్లేశం రాజేశం సతీష్ రాజ్ కుమార్ కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు