అగ్నిధార న్యూస్ ,పెద్దపల్లి జిల్లా:
*ప్రజాసమస్యలను సత్వరమే పరిష్కరించాలి :: జిల్లా కలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ*
– ప్రజాసమస్యల్ని సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ లోని తన చాంబర్లో సోమవారం ప్రజల వద్ద నుంచి అర్జిలను స్వీకరించారు. వివిధ సమస్యలపై ప్రజల నుండి పలు వినతులు అందినట్లు తెలిపారు. ప్రజల నుండి వినతులను స్వీకరించి సంబంధిత శాఖలకు వెంటనే పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేశారు.
అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ కుమార్ దీపక్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
