అగ్నిధార న్యూస్ ,పెద్దపల్లి జిల్లా:

సోమవారం రోజున పెద్దపల్లి కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో ప్రజాసమస్యలను సత్వరమే పరిష్కరించాలి అని జిల్లా కలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ అన్నారు . ఈసందర్భంగా మాట్లాడుతూ ప్రజాసమస్యల్ని సత్వరమేపరిష్కరించాలని   సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ లోని తన చాంబర్లో  ప్రజల నుంచి అర్జిలను స్వీకరించారు. వివిధ సమస్యలపై పలు వినతులు అందినట్లు తెలిపారు. ప్రజల నుండి వినతులను స్వీకరించి సంబంధిత శాఖలకు వెంటనే పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేశారు.

అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ, ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.