అగ్నిధార న్యూస్, పెద్దపల్లి:
సోమవారం రోజున వ్యవసాయ మార్కెట్ కమిటీ పెద్దపల్లి నందు వరీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీ బానోత్ శంకర్ నాయక్ ,వైస్ చైర్మన్ జడెల సురేందర్ తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్మన్, వైస్ చైర్మన్ మాట్లాడుతూ పెద్దపల్లి చుట్టుపక్కల ఉన్న రైతులందరూ పెద్దపల్లి లోని వ్యవసాయ మార్కెట్ యాడ్ లోకి తమ తమ వరి ధాన్యాన్ని తెచ్చి ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకు అమ్ముకోవాలని సూచించారు .మార్కెట్ యార్డ్ లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పించాలని అధికారులకి సూచించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ సెక్రటరీ పృథ్వీరాజ్, డైరెక్టర్స్ బొడకుంట నరేష్, మోగ్గులపల్లి క్రిష్ణ మూర్తి, కుంభం సంతోష్ కుమార్ మరియు చింతం వెంకటస్వామి మార్కెట్ సిబ్బంది సతీష్ తదితరులు పాల్గొన్నారు పాల్గోన్నారు.
