అగ్నిధార న్యూస్ పెద్దపల్లి జిల్లా:

ప్రణాళికాబద్ధంగా ఉపాధి హామీ పనుల లక్ష్యాల పూర్తి:: జిల్లా కలెక్టర్ ,                                           డాక్టర్ సంగీత సత్యనారాయణ

ప్రతిరోజు ఎంపీడీవోలు 3 గ్రామాలకు క్షేత్రస్థాయిలో సందర్శించాలి
జల శక్తి అభియాన్ పనులపై మండలాల వారీగా నివేదిక సమర్పించాలి
2 ఎకరాల పైన భూమి గల రైతుల కళ్ళాల మంజూరు పత్రాలు అందించాలి
నవంబర్ చివరి వరకు ప్రతి మండలంలో 5కిలో మీటర్ల ప్లాంటేషన్ పూర్తి చేయాలి
ప్రతి మండలంలో 5 మెగా పల్లె ప్రకృతి వనరుల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం
ఉపాధి హామీ పనులు, రైతు కళ్ళాల నిర్మాణం, హరితహారం తదితర అంశాలపై సంబంధిత అధికారులతో రివ్యూ నిర్వహించిన జిల్లా కలెక్టర్,
 జిల్లాలో ప్రణాళికాబద్ధంగా ఉపాధిహామీ పనులు లక్ష్యాలను పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఉపాధి హామీ పనుల్లో నిర్వహణ, హరితహారం తదితర అంశాలపై ఎంపీడీవో లతో కలెక్టర్ బుధవారం తన క్యాంపు కార్యాలయంలో రివ్యూ నిర్వహించారు. పెద్దపల్లి కమాన్పూర్ మినహాయించి ప్రతి మండలంలో అక్టోబర్ మాసంలో గత సంవత్సరం కంటే ఉపాధి హామీ పనులు తగ్గాయని, దీనికి గల కారణాలపై కలెక్టర్ మండలాల వారీగా సమీక్ష నిర్వహించారు. జూలపల్లి మండలంలో 21% మేర మాత్రమే లక్ష్యాలను చేరుకున్నారని, పరిస్థితి మెరుగుపరుచుకోవాలని కలెక్టర్ సూచించారు. ఎస్సారెస్పీ కాలువ వద్ద ట్రెంచ్ నిర్మాణ పనులు ఉపాధిహామీ కింద చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. నవంబర్ మాసంలో ఉపాధి హామీ పనుల ప్రణాళిక పై 3 రోజుల్లో కార్యాచరణ సిద్ధం చేసి సమర్పించాలని కలెక్టర్ ఆదేశించారు* ఉపాధి హామీ పనులు కింద జనరేట్ చేసిన వాటిని ఎంపీడీవోలు ఎప్పటికప్పుడు ఆన్ లైన్ లో అప్లోడ్ చేయాలని కలెక్టర్ సూచించారు. నర్సరీ, మొక్కల పెంపకం, వాచ్ అండ్ వార్డ్ నియామకం వంటి చర్యల ద్వారా ఉపాధి హామీ పనులు పెరుగుతాయని కలెక్టర్ సూచించారు. జిల్లాలోని ఎంపీడీవోలు వారి మండల పరిధిలో ప్రతిరోజు 3 గ్రామాల్లో క్షేత్రస్థాయి సందర్శన చేయాలని కలెక్టర్ ఆదేశించారు  జిల్లాలో నూతనంగా 11041 జాబ్ కార్డులు మంజూరు చేయాల్సి ఉండగా 1448 జాబ్ కార్డులు మంజూరు చేశామని గత అక్టోబర్ మాసంలో 212 జాబ్ కార్డులు మంజూరు చేశామని అధికారులు వివరించారు. ఎంపీడీవోలు వారి పరిధిలోని గ్రామాల్లో జరుగుతున్న నరేగా పనులు నూతన జాబ్ కార్డు పంపిణీ తదితర అంశాలపై ప్రతిరోజు రివ్యూ నిర్వహించాలని కలెక్టర్ సూచించారు. జిల్లాలో ధాన్యం ఆరబెట్టుకునెందుకు వీలుగా 16.73 కోట్ల అంచనాతో 2055 పనులు మంజూరు చేశామని, 447 పనులు గ్రౌండ్ అయ్యాయని, 55 పనులు పూర్తి చేశామని అధికారులు వివరించారు. కళ్ళాల నిర్మాణంలో ఏర్పడుతున్న సమస్యలను కలెక్టర్ ఆరా తీశారు. మంజూరైన కళ్ళాల జాబితాలో 2 ఎకరాల కంటే అధికంగా భూమి ఉన్న రైతుల వివరాలను సేకరించి, పంచాయతీ సెక్రెటరీ ల ద్వారా మంజూరు పత్రాలను వారికి క్షేత్రస్థాయిలో అందించాలని కలెక్టర్ సూచించారు* హరితహారం కింద నాటిన మొక్కల లో 92% మొక్కలు జియో ట్యాగింగ్ పూర్తి చేశామని అధికారులు వివరించారు. హరితహారం కింద గ్రామీణ అభివృద్ధి శాఖ ద్వారా 2037371 మొక్కలు నాటగా వాటిలో 86.29% బ్రతికి ఉన్నాయని అధికారులు వివరించారు. *ప్రతి మండల పరిధిలో 5 కిలోమీటర్ల మేర అవెన్యూ ప్లాంటేషన్ 3 వరుసలలో సుందరీకరణ చేపట్టాలని, నవంబర్ చివరి వరకు పనులు పూర్తి చేయాలని కలెక్టర్ ఎంపీడీవో లను ఆదేశించారు* జిల్లాలో 4000 పైగా సైట్లకు వాచ్ వార్డులను ఏర్పాటు చేయాల్సి ఉండగా, 2000 సైట్లకు ప్రస్తుతం ఏర్పాటు చేశామని అధికారులు వివరించారు. జిల్లాలో గుర్తించిన ప్రతి సైట్ కు వాచ్ అండ్ వార్డ్ ఏర్పాటు చేసే దిశగా శనివారం వరకు చర్యలు తీసుకోవాలని, వాచ్ అండ్ వార్డ్ నియమించ లేని పక్షంలో దానికి గల కారణాలను తెలియజేయాలని కలెక్టర్ ఆదేశించారు. జల శక్తి అభియాన్ కింద మంజూరైన పనుల్లో పురోగతి వివరాలను పరిశీలించి , గ్రామాల వారీగా పండ్ల స్థితిగతులపై నివేదిక రేపటి వరకు సమర్పించాలని కలెక్టర్ సూచించారు. జిల్లాలోని ప్రతి మండలంలో పది ఎకరాల స్థలంలో మెగా పల్లె ప్రకృతి వనం ఏర్పాటు చేశామని, ప్రభుత్వ 5 నుంచి పది ఎకరాల స్థలంలో మరో 67 మెగా పల్లె ప్రకృతి వరాలు ఏర్పాటు చేయడానికి లక్ష్యాన్ని నిర్దేశించింది అధికారులు తెలిపారు. *ప్రతి మండలంలో 5 మెగా పల్లె ప్రకృతి వనాల ఏర్పాటుకు భూములు పరిశీలించి ప్రతిపాదనలు తయారు చేయాలని కలెక్టర్ తెలిపారు* ప్రభుత్వ భూములు అందుబాటులో లేని పక్షంలో సదరు మండలంలో ఉన్న అటవీ భూములను తీసుకోవాలని, అటవీ భూమిలో మొదట ట్రెంచ్ ఏర్పాటుచేసి దట్టంగా మొక్కలు నాటాలని కలెక్టర్ తెలిపారు. ఎంపీడీవోలు భూమి లభించని పక్షంలో వారి మండలాల అటవీ అధికారులతో సమన్వయం చేసుకోవాలని, దీనికి సంబంధించి ఫారెస్ట్ అధికారులకు అవసరమైన సమాచారం అందించాలని జిల్లా అటవీ శాఖ అధికారులను కలెక్టర్ ఆదేశించారు .

 

జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి శ్రీధర్, జిల్లా పంచాయతీ అధికారి చంద్రమౌళి జిల్లా అటవీశాఖ అధికారి శివయ్య, ఎంపీడీవోలు ఏపీవో లు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

.