అగ్నిధార న్యూస్, పెద్దపల్లి:

పెద్దపెల్లి జిల్లా కేంద్రంలోని, నందన గార్డెన్లో  నేషనల్ యాక్టివ్ రిపోటర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇ శ్రామ్ ఉచిత ప్రమాద బీమా సౌకర్యం అవగాహన సదస్సుకు తెలంగాణ సోషల్ సెక్యూరిటీ బోర్డు చైర్మన్ దేవేందర్ రెడ్డి హాజరై మాట్లాడుతూ అసంఘటిత కార్మిక రంగానికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇ శ్రామ్ ఉచిత ప్రమాద బీమా సౌకర్యాన్ని ఉపయోగించుకోవాలి  అన్నారు. అసంఘటిత కార్మికులు ఎలాంటివి చట్టబద్ధ హక్కులను సౌకర్యాలకు నోచుకోక ప్రమాదపు అంచుల్లో పనిస్థలాల్లో రక్షణ చర్యలు లేక ప్రమాదాల బారినపడి దిక్కులేని స్థితిలో మరణిస్తున్నారని అన్నారు . ఉచిత ప్రమాద బీమా సౌకర్యం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని దీనిని ఈఎస్ఐ పీఎఫ్ ఐటీ అమలుకాని ప్రతి శ్రామిక జీవి ప్రతి కార్మికుడు ఉపయోగించుకోవాలని అసంఘటిత కార్మిక రంగానికి పిలుపునిచ్చారు. ఈ శ్రమ్ కార్డు పొందాలనుకునేవారు 16 సంవత్సరాల నుండి 59 సంవత్సరాల వయసు కలిగి ఉండాలన్నారు .మీ సేవలో గాని లేబర్ ఆఫీసులో గాని దరఖాస్తు చేసుకోవచ్చు దరఖాస్తు చేసుకునే వ్యక్తి ఆధార్ కార్డ్ బ్యాంక్ పాస్  ఫోన్ నెంబర్ కలిగి ఉండాలన్నారు సదస్సులో ఉమ్మడి కరీంనగర్ జిల్లా డి సి ఎల్ రమేష్ బాబు పెద్దపల్లి జిల్లా ఏ సి ఎల్ రాజ లింగం వార్త ప్రపంచం దినపత్రిక చీప్ఎడిటర్ నేషనల్ యాక్టివ్ రిపోటర్స్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు  సురేంద్ర బాబు మానస మాట్లాడుతూ  జర్నలిస్ట్ అనేవాళ్ళు ఉదయించే సూర్యని  లాంటి వాళ్ళు అన్నారు. సూర్యోదయం లేకుంటే ప్రపంచమంతా ఎలా చీకటిగా ఉంటుందో జర్నలిస్టు అనే వ్యక్తి లేకుంటే ప్రపంచానికి సమాచారం ఇచ్చే వాళ్ళు లేరు అని కొనియాడారు ఈ కార్యక్రమంలో పెద్దపల్లి ప్రెస్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు చింతకింది చంద్రమౌళి నారాయణ దాస్ అశోక్ రాజేందర్ రామకృష్ణ ఆకుల రమేష్ వీరమల్ల విద్యాసాగర్ ముఖేష్ కన్నురి అంజి  సత్యనారాయణ రమేష్ రాజ్ కుమార్. సాబీర్ పాష తదితరులు పాల్గొన్నారు