అగ్నిధార న్యూస్, పెద్దపల్లి:.                                   

జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం తమ పోరాటాన్ని కొనసాగిస్తామని టీయూడబ్ల్యూజే ఐజేయూ జిల్లా అధ్యక్షులు సంపత్ కుమార్ స్పష్టం చేశారు.

    ఆదివారం పెద్దపల్లి ఎంపిడిఓ కార్యాలయం  ఆవరణలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చే నెలలో పెద్దపల్లి జిల్లా కార్యవర్గ ఎన్నికలను నిర్వహించనున్నామని తెలిపారు. జిల్లావ్యాప్తంగా సభ్యత్వ నమోదు కార్యక్రమాలు గత వారం రోజులుగా చురుగ్గా సాగుతున్నాయని తెలిపారు. ఈ నెలాఖరులోగా సభ్యత్వాలను, మండల కమిటీలను పూర్తి చేసి వచ్చే నెలలో జిల్లా మహాసభను నిర్వహిస్తామని చెప్పారు. జర్నలిస్టుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం ఉదాసీన వైఖరితో వ్యవహరిస్తున్నదని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి జర్నలిస్టులఏ ఒక సమస్యను పరిష్కరించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. జర్నలిస్టులకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, ఇళ్లస్థలాలు ఇస్తామని అర్హులైన వారందరికీ అక్రిడేషన్ కార్డులను జారీ చేస్తామని హెల్త్ కార్డులను జారీ చేస్తామని పలుమార్లు హామీ ఇచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటి వరకు వాటిని నెరవేర్చలేదని అన్నారు. సంఘం ఆధ్వర్యంలో పలుసార్లు ధర్నాలు రాస్తారోకోలు ఆందోళన కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు మంత్రులు ఎమ్మెల్యేలు జిల్లా అధికార యంత్రాంగానికి వినతి పత్రాలను అందజేసిన కూడా ప్రభుత్వంలో చలనం లేదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరిచి తమ సమస్యలను పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి  నారాయణదాసు అశోక్. దాడుల వ్యతిరేక కమిటీ కో కన్వీనర్ చింతకింది చంద్రమౌళీ. జిల్లా కార్యవర్గ సభ్యులు కె ఎల్ మూర్తి. జిల్లా లీగల్ అడ్వైజర్ రాచూరి శ్రీకాంత్. జర్నలిస్టులు రాజేందర్ ఆకుల రమేష్ శివా చారి వీరమల్ల విద్యాసాగర్ రావు  కే ఎల్ మూర్తి యాదవ్ చేగొండ రవి కుమార్ యాదవ్ కలవెన రాజేందర్  మల్లేష్ ఇబ్రహీం సాగర్  రమేష్ తదితరులు పాల్గొన్నారు