అగ్నిధార న్యూస్ ,పెద్దపల్లి నిఘా: పెద్దపెల్లి జిల్లాపెద్దపల్లి మండలం భోజన పేట గ్రామానికి చెందిన కుడుడుల సాగర్ S/O రాజ కొమురయ్య తేదీ26.07 2021 రోజున తన స్వగ్రామం భోజన పేటలో వ్యవసాయ పనుల నిమిత్తం పోయి వచ్చినాక అకస్మాత్తుగా ఒక్కసారిగా కింద పడిపోవడంతో తన భార్య, కుటుంబ సభ్యులు హుటాహుటిన పెద్దపల్లి లోని ప్రభుత్వ వైద్యశాలకు తీసుకెళ్లారు డాక్టర్లు హాస్పటల్లో O P NO.6351 ద్వారా అడ్మిట్ చేసుకుని సాయంత్రం 5.20 నిమిషాలకు బ్రాడెడ్ గా నిర్దారణ చేసి శవాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.ఇంతవరకు బాగానే ఉంది.
తదనంతరం చనిపోయిన వ్యక్తికి సంబంధించిన వివరాలు ప్రభుత్వ వైద్యశాల ద్వారా ,పెద్దపల్లి మున్సిపల్ ఆఫీస్ వారికి డెత్ సర్టిఫికెట్ కోసం పంపారు. పెద్దపల్లి మున్సిపల్ కార్యాలయం వారు 275 నెంబర్ ద్వారా కుడుదుల సాగర్s/o రాజ కొమురయ్య పేరుమీద మరణ ధ్రువీకరణ పత్రం జారీ చేశారు. పెద్దపల్లి మున్సిపల్ పరిధిలోని ప్రభుత్వ హాస్పటల్ లో డెత్ డిక్లేర్ చేసినటువంటి వ్యక్తికి,భోజన పేట గ్రామ పంచాయతీ కార్యదర్శి ఇదే కుడుదుల సాగర్ కు ,మున్సిపాలిటీ ఆఫీస్ పెద్దపెల్లి వారి కంటే ముందే మరణ ధ్రువీకరణ సర్టిఫికెట్ జారీ చేయడం విశేషం. గ్రామపంచాయతీ Record nember 02 నమోదు ద్వారా వారి కుటుంబ సభ్యులకు ( భార్యకు కాదు) జారీ చేయడంలో మర్మమేమిటో తెలియడం లేదు.
తను జారీచేసిన మరణ ధ్రువీకరణ పత్రం ద్వారా కుడుదల సాగర్ s/o రాజ కొమురయ్య పేరుమీద ఉన్న భూములు, బ్యాంకులో ఉన్న డబ్బులు, రైతు బీమా డబ్బులు, మొత్తం తన భార్యకు తెలియకుండానే మార్పు చెందాయి,
దీనంతటికీ కారణం భోజన పేట పంచాయతీ కార్యదర్శి జారీ చేసినటువంటి మరణ ధ్రువీకరణ పత్రమే కారణంగా కనబడుతుంది. ఇక్కడ ప్రధాన చర్చ. పెద్దపల్లి ప్రభుత్వ హాస్పటల్ లో అడ్మిట్ అయిన వ్యక్తికి భోజన పేట లో డెత్ సర్టిఫికెట్ ఎలా ఇస్తారు అనేది ఇప్పుడు ఇక్కడ చర్చనీయాంశం మిలియన్ డాలర్ల ప్రశ్న?.
దీనిపైన కుడుదుల సాగర్ భార్య సంబంధికులు జిల్లా పంచాయతీ అధికారికి 29.09.2021 రోజున ఫిర్యాదు కూడ చేశారు.
