అగ్నిధార న్యూస్ ,పెద్దపల్లి:.                                    ఇటీవల కొత్తపల్లి గ్రామంలో అనారోగ్యంతో ఆత్మహత్య చేసుకుని బలవన్మరణం పొందిన నిరుపేద కుటుంబం మెట్టు నరేష్ కుటుంబన్నీ ఈరోజు కొత్త పల్లి లోని ధర్మ సేన యూత్ సభ్యులు  పరామర్శించారు. నరేష్ కుటుంబానికి సహాయం చేయాలని ధర్మసేన యూత్ సభ్యులు నల్ల మనోహర్ రెడ్డి ని కోరగా నల్ల పౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు వెంటనే స్పందించి ధర్మసేన యూత్ ద్వారా మృతుని కుటుంబానికి 50 కిలోల బియ్యం 5000 వేల రూపాయలు సహాయం చేశారు. ఈ సందర్భంగా  నరేష్ కుటుంబ సభ్యులు ధర్మసేన యూత్ సభ్యులు నల్ల మనోహర్ రెడ్డి కి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నరేష్. రాకేష్ .కుమార్ .నవీన్ .రాము ఓదెలు. ప్రశాంత్. రామ్. అఖిల్.రాజు. అజయ్. తదితరులు పాల్గొన్నారు