అగ్నిధార న్యూస్ ,పెద్దపల్లి:
శ్రీలక్ష్మీ నరసింహస్వామి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే దాసరి. పెద్దపల్లి మండలం దేవునిపల్లి గ్రామంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జాతరలో భాగంగా ఈ రోజు స్వామీ వారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది ఈ కళ్యాణ మహోత్సవానికి కి పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయనను ఆలయ సిబ్బంది ఘనంగా సన్మానించారు . Mla మాట్లాడుతూ దేవుని పల్లి లో వెలిసిన టువంట లక్ష్మీ నరసింహ స్వామి చాలా విశిష్టమైన మహిమలు గల దేవుడు అన్నారు .జాతర సమయంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలవకుండా చూడాలని దేవస్థానం E O శంకర్ సిబ్బందిని ఆదేశించారు. ఈ కార్యక్రమం లో బండారి శ్రీనివాస్, బాలాజీ రావు,మండల పార్టీ అధ్యక్షుడు మార్కు లక్ష్మణ్, సర్పంచ్ రావిశెట్టి కిషన్, ఎంపీటీసీ లు లక్ష్మణ్,తోట శ్రీనివాస్, సర్పంచ్ శారద-శ్రీనివాస్,, కనకరాజు, నర్సింగం,రాజేశం, నారాయణ, తిరుపతి, రాజయ్య, నర్సయ్య,చంద్రయ్య, గ్రామ పాలక వర్గం, ,అధిక సంఖ్యలో భక్తులు, తెరాస ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
