అగ్నిధార న్యూస్ ,పెద్దపల్లి:

పెద్దపల్లి పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారతదేశ మొట్టమొదటి మహిళా ప్రధాని స్వర్గీయ ఇందిరాగాంధీ గారి 104 వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా కాంగ్రెస్ అద్యక్షులు ఈర్ల కొమురయ్య మాజీ ఎమ్మెల్యే విజయ రమణ రావు హాజరై శ్రీమతి ఇందిరాగాంధీ గారి చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సంధర్భంగా వారు మాట్లాడుతూ పేదరిక నిర్మూలన కోసం 20 సూత్రాలను ప్రవేశపెట్టి దేశ ఆర్థిక పరిస్థితిని అభివృద్ధివైపు నడిపించిన మహోన్నత నేత ఇందిరా గాంధీ అన్నారు. దేశంలో పేదరిక నిర్మూలనకు గరీబీ హటావో నినాదంతో నలభై మూడు రోజులపాటు దేశమంతటా పర్యటిస్తూ 300 సభలు 36 వేల మైళ్ల పర్యటన చేసి ప్రజల స్థితిగతులు మార్చడానికి అనేక సంస్కరణలు ప్రవేశపెట్టారని, జాతీయ భద్రత ఆర్థిక వ్యవస్థ విదేశాంగ విధానానికి చేసిన సేవలు చిరస్మరణీయం ,పేదల పక్షపాతిగా బడుగు బలహీనర్గాలకు ఆశాజ్యోతిగా ఉన్నారన్నారు. రాజభరణాల రద్దు బ్యాంకుల జాతీయకరణ హరిజన గిరిజనులకు భూపంపిణీ రోటి కపడా లాంటి సంస్కరణలు ప్రవేశపెట్టారని దేశంలోని అనేక రంగాలను గాడిలో పెట్టిన ఘనత ఆమెకే దక్కుతుందని మహిళా లోకానికి ఆమె స్ఫూర్తి దాయకం అన్నారు.ప్రతీ ఒక్క కాంగ్రెస్ కార్యకర్త శ్రీమతి ఇందిరాగాంధీ ఆశయ సాధనకు కాంగ్రెస్ పార్టీ పూర్వ వైభవానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ మైనారిటీ సెల్ అద్యక్షులు ఎస్ కే అక్బర్ అలీ, ఎండి సర్వర్ పాషా, సయ్యద్ మస్రత్ పెద్దపల్లి అసెంబ్లీ యూత్ కాంగ్రెస్ అద్యక్షులు పూదరి చంద్ర శేఖర్, కాంగ్రెస్ నాయకులు నుగిళ్ళ మల్లయ్య , భూతగడ్డ సంపత్, నేత్తెట్ల కుమార్,తూముల సుభాష్, తాడురి శ్రీమాన్ సురేష్ గౌడ్ ,వేముల రాజు, , తమ్మడబోయిన రాజ్ కుమార్ తదితరులు పాల్గోన్నారు