అగ్నిధార న్యూస్ ,పెద్దపల్లి:

రైతుల సుదీర్ఘమైన పోరాట ఫలితమే సాగు చట్టాల రద్దును తాండ్ర సదానందం.     

కేంద్ర ప్రభుత్వంపై  ఢిల్లీలో రైతులు చేస్తున్నటువంటి సుదీర్ఘ ఉద్యమ ఫలితంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం దిగి వచ్చిందని సిపిఐ జిల్లా కార్యదర్శి తాండ సదానందం అన్నారు.   సాగుచట్టలు మంచివే దేశంలో ఉన్న సన్న చిన్నకారు రైతులకు ఉపయోగపడేవి కానీ ఈ విషయాన్నీరైతుల్లో విశ్వాసాన్ని ఏర్పాటు చేయలేక పోయాం అందుకే రద్దు చేస్తున్నాము అని మోడీ ప్రకటించడం రైతు విజయమన్నారు. ఇప్పటికి ఈచట్టాలు రైతులను వ్యవసాయాన్ని రంగాన్ని  దారుణంగా దెబ్బతీస్తాయనే విషయాన్ని బహిరంగంగా కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోవడం లేదన్నారు.సుప్రీంకోర్టు ఈచట్టలను తాత్కాలికంగా పెండింగ్లో పెట్టి రైతులతో చర్చించాలని కోరిన స్పందించని మోడీ ప్రభుత్వం వన్ ఈరోజు రద్దు చేస్తున్నామని ప్రకటించే వరకు వచ్చాడు, అంటే రైతుల సమీకరణ సంవత్సర కాలం సుధీర్ఘ పోరాట ఫలితం ఇదిరేపు పార్లమెంటులో ఏరకమైన మెలికలు పెడతారు వేచి చూడాలి అన్నారు. సాగు చట్టలతోపాటు విద్యుత్ సవరణ బిల్లు ఉపసంహరణ గురించి పంటల మద్దతు ధరలు గ్యారంటీ చట్టం గురించిన డిమాండ్లపై ఏమి మాట్లాడని పరిస్థితి నేడు కేంద్ర పాలకులది అన్నారు. అందుకే చట్టాలను రద్దు చేసినందుకు స్వాగతిస్తూనే మిగితా డిమాండ్లను నెరవేర్చాలని పోరాటాన్ని కొనసాగిస్తామన్నారు 2022 సంవత్సరం మొదటి మాసాలలో ఉత్తరప్రదేశ్ లో పంజాబ్ లో ఎన్నికలు జరగబోతున్నాయి ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగిన కేంద్ర పాలకులు ఓడించమని రైతు ఉద్యమం ఇచ్చిన పిలుపుతో కేంద్ర ప్రభుత్వంలో భయం పుట్టింది అన్నారు.