అగ్నిధార న్యూస్, పెద్దపల్లి :
ఈ రోజు హైదరాబాద్ లోని పబ్లిక్ గార్డెన్ వద్ద తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వరి రైతుల నిరసన ప్రదర్శన కార్యక్రమంలో ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి , మంథిని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో కలిసి పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే చింతకుంట విజయరామణారావు నిరసన ప్రదర్శన కార్యక్రమంలో పాల్గొన్నారు . ఈ సందర్భంగా విజయ రమణారావు మాట్లాడుతూకేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల రైతు వ్యతిరేక విధానాల వల్ల తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి యావత్ రైతు ప్రపంచం అరిగోస పడాల్సిన పరిస్థితి దాపురించింది అన్నారు .తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు వర్షాకాలంలో పండించిన పంట సంతోషంగా అమ్ముకొని వేసంగి పంటకు సన్నద్ధం కావాల్సిన అటువంటి పరిస్థితులలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ద్వంద వైఖరి వల్ల రైతులందరూ అయోమయానికి గురికావాల్సి వస్తుందన్నారు. రెండు ప్రభుత్వాలు రైతుల పట్ల నిర్లక్ష్య వైఖరితో ఉన్నాయన్నారు. రెండు ప్రభుత్వాలు కూడపలుక్కొని నాటకానికి తెరలేపాయి అన్నారు . ఈ నాటకంలో తెలంగాణ రైతులను బలిపశువులు చేసి వరిగోస పెట్టాలని చూస్తున్నాయన్నారు. అయినా వెనక్కి తగ్గేది లేదు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వ్యతిరేక విధానాల పట్ల కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఎప్పుడు అండగా ఉంటుందన్నారు.
