అగ్నిధార న్యూస్ ,పెద్దపల్లి పట్టణం:

డ్రైనేజీ పనులను పరిశీలించిన మున్సిపల్ చైర్ పర్సన్  డాక్టర్ దాసరి మమతా రెడ్డి .

గురువారం రోజున.  పెద్దపల్లి మున్సిపల్ చైర్ పర్సన్ డాక్టర్ దాసరి మమత రెడ్డి  పట్టణంలోని ఉదయ నగర లో జరుగుతున్న డ్రైనేజీ పనులను  ఆకస్మిక తనిఖీ చేసి పరిశీలించారు .ఈ సందర్భంగా మున్సిపాలిటీ సిబ్బందికి పలు సూచనలు చేశారు. పెద్దపల్లి పట్టణ ప్రజలందరికీ తడి చెత్త పొడి చెత్త మీద  పూర్తిస్థాయిలో అవగాహన కలిగి ఉండేలా చూడాలన్నారు.డ్రైనేజ్ కాలువల లో ప్రజలు చెత్తాచెదారం ప్లాస్టిక్ కవర్స్ వేయకుండా ఎప్పటికప్పుడు  సిబ్బంది చర్యలు తీసుకోవాలన్నారు. మురుగునీరు వ్యవస్థని కాలువల ద్వారా సక్రమంగా ప్రవహించేలా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో 5 వ వార్డు కౌన్సిలర్ పెంచల రమా శ్రీధర, టిఆర్ఎస్ సీనియర్ నాయకులు అక్కపాక తిరుపతి, వెనం రవీందర్, బొంకురి శ్రీధర్ , మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.