అగ్నిధార న్యూస్ ,హైదరాబాద్:
హైదరాబాద్ ఇందిరాపార్క్ దగ్గర టీఆర్ఎస్ మహాధర్నాలో సీఎం కేసీఆర్ తో పాటు మంత్రి కొప్పుల ఈశ్వర్ పాల్గొన్నారు . ఈ సందర్భంగా మంత్రి ఈశ్వర్ మాట్లాడుతూ వరిధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం తన వైఖరి స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. యావత్ భారత్ దేశంలో ఉన్న రైతులoదర్నీ ముఖ్యంగా తెలంగాణలో ఉన్న రైతుల్ని కేంద్ర ప్రభుత్వంలో ఉన్న మంత్రులు రాష్ట్రంలో ఉన్న bjp ఎంపీలు bjp రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తమ మాటల గారడి తోటి అయోమయానికి గురి చేస్తున్నారన్నారు . వేసంగిలో పండించే వరి పంట రైతులు దొడ్డు వడ్లు పండిస్తారు . ఆ పండించిన దొడ్డు వడ్లు కచ్చితంగా ఉడక పెట్టాల్సిందే ఉడకబెట్టిన వడ్లు కొన్నాము అని చెబుతున్నా కేంద్ర ప్రభుత్వం ,వేసంగిలో వరి ధాన్యం కొనుగోలు చేయమని చెప్పే ధైర్యం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు . ఢిల్లీలో రైతులు శాంతియుత ధర్నాలు చేస్తుంటే కేంద్ర ప్రభుత్వ బలగాలతో వాళ్లని అనేక రకాలుగా అణిచివేయడం కాకుండా రైతులపై వాహనాలు ఎక్కించి తొక్కించిన సందర్భాలు ఉన్నాయని ,ఆవేదన వ్యక్తం చేశారు. మహాధర్నా ఈ కార్యక్రమంలో సహచర మంత్రులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
