అగ్నిధార న్యూస్ ,రామగుండం క్రైమ్:                  రామగుండం రైల్వే స్టేషన్ ప్లాటుఫారం దగ్గరలో  గుర్తితెలియని వ్యక్తి పురుషుడు వయసు దాదాపు 60 సంవత్సరాలు బహుశా రైలు లు పట్టాల వెంట వెళ్లుచుండగా ఈరోజు తెల్లవారుజామున 3 గంటలకు ముందు ఎదో గుర్తు తెలియని రైల్ బండి డి కొట్టుట  వలన చనిపోయినాడు, అని రామగుండం రైల్వే హెడ్ కానిస్టేబుల్ జి తిరుపతి తెలిపారు. మృతుని ఎత్తు 5.5″, చామనచాయ రంగు, కొల ముఖం, తెలుపు వెంట్రుకలు, గడ్డం, పసుపు తెలుపు గీతల డిజైన్ గల ఫుల్ షర్ట్, గ్రీన్ కలర్ షార్ట్, గ్రీన్ నలుపు పూల లుంగీ ధరించినాడు. నడుముకు మొలత్రాడు ఉన్నందున ,హిందువు కావచ్చును. మృతుడిని ప్రభుత్వ హాస్పిటల్ గోదావరిఖనికి తరలించడం జరిగింది. .ప్రభుత్వ రైల్వే హెడ్ కానిస్టేబుల్ జీ తిరుపతి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు .

సంబంధిత వ్యక్తి వివరాలు ఏమైనా  తెలిసినచో             ఈసెల్ నెంబర్ కి సమాచారం అందించగలరు.         9949304574