అగ్నిధార న్యూస్, హైదరాబాద్:                           

గురుకుల పాఠశాలలను ఆకస్మిక తనిఖీ చేసిన మంత్రి కొప్పుల.

  కరోనా అనంతరం పున:ప్రారంభమైన సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో సమస్యలు, సౌకర్యాలు ఎలా ఉన్నాయో తెలుసుకునేందుకు తెలంగాణ రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్  బుధవారం రోజున హైదరాబాద్ గౌలిదొడ్డి లోని సాంఘిక సంక్షేమ గురుకుల (సెంటర్ ఫర్ ఎక్సలెన్స్) బాలికల మరియు బాలుర పాఠశాలలను ఆకస్మిక  తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రాంగణంలోని తరగతి గదులు, హాస్టల్ భవనం,బాత్రూంలు మెస్ హాల్,   సందర్శించారు. అనంతరం  ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు మరియు ఇతర సిబ్బందితో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకుని వాటిని తక్షణమే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.. ఈ సందర్భంగా మంత్రి కొప్పుల ఈశ్వర్ పాఠశాల ప్రాంగణంలో విద్యార్థులతో విద్య గొప్పదనం, ప్రాముఖ్యత గురించి  విద్యార్థులకు తెలియజేశారు. నేటి సమాజంలో అడుగడుగున మోసాలు  కనపడుతున్నప్పటికి తనను మోసం చేయకుండా నిత్యం వెంట ఉండేది విద్య అన్నారు .మంచి చెడు విచక్షణను విద్య మనకు నేర్పుతోంది అన్నారు విద్యార్థులందరూ బాగా చదివి దేశానికి రాష్ట్రానికి పుట్టి పెరిగిన ప్రాంతానికి తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలని ఆకాంక్షించారు . విద్యార్థులు క్రమశిక్షణతో కష్టపడి  ఇష్టంగా చదివి ఉన్నత శిఖరాలను  అవరోహించాలి అన్నారు. ఎక్కడో మారుమూల గ్రామాల్లో కడు పేదరికంలో మగ్గుతున్న పేద ఎస్సీ-ఎస్టీ-బీసీ-మైనార్టీ మరియు ఆర్దికంగా వెనుకబడిన వర్గాల విద్యార్థులను ప్రపంచంలో ఎవరితోనైనా పోటీ పడి విజయం సాధించేలా తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలు వారికి బంగారు భవిష్యత్తును ప్రసాదిస్తున్నాయి అన్నారు. ఒకప్పుడు కేవలం కార్పొరేట్ విద్యా సంస్థల్లో చదివే వారికి మాత్రమే మెడికల్, ఇంజనీరింగ్ సీట్లు వచ్చేవి కానీ తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక గౌరవ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు  అందరికీ కేజి టూ పీజీ నాణ్యమైన ఉచిత విద్యను అందించాలనే ధృఢ సంకల్పం వల్ల నేడు సంక్షేమ, గురుకుల, విద్యాలయాలలో చదివే విద్యార్థులు ఎంబీబీఎస్, ఇంజనీరింగ్, ఐఐటీ, ట్రిపుల్ ఐటి వంటి ప్రతిష్టాత్మక సంస్థల్లో సీట్లు పొందుతున్నారు. గత సంవత్సరం నిర్వహించిన నీట్ పరీక్షలో ఎంబీబీఎస్-241 మంది, బీడిఎస్-30 మంది, నిట్-49 మంది, ట్రిపుల్ ఐటీల్లో 19 మంది, ఐఐటీల్లో 86 మంది సీట్లు పొందడం నిజంగా గర్వించదగ్గ విషయం అన్నారు.ఇది తెలంగాణ ప్రభుత్వం సంక్షేమ గురుకుల పాఠశాలల పట్ల వహిస్తున్న ప్రత్యేక శ్రద్దకు తార్కాణం అన్నారు . దేశంలో వెయ్యికి పైగా గురుకులాలను పకడ్బందీగా, సమర్థవంతంగా నిర్వహిస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమేనని, ఇంకా భవిష్యత్ లో పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులు చదువుకుంటున్న సంక్షేమ గురుకుల విద్యాసంస్థలను అద్భుతంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని పునరుద్ఘాటించారు. ఈ తనిఖీల్లో మంత్రి  వెంట జే.ఎస్- కే.శారద, ఓఎస్డీ- ఏవి.రంగారెడ్డి, ఐఐటీ అకాడెమీ – కే.సత్యనారాయణ, సిఓఈ- ఏ.శారద తదితరులు ఉన్నారు