✍️✍️ శ్రీనివాస్
అగ్నిధార ప్రతినిధి: కామారెడ్డి
ఒక కుటుంబ పెద్ద లేక’పోతే’ఆ కుటుంబం పడే బాధ అంతా ఇంతా కాదు. ఏ పని చేయాలన్న…ఎటు వెళ్లాలన్న… ఆ కుటుంబానికి అనుక్షణం కన్నీళ్లు వేధిస్తూనే ఉంటాయి. అలాగే ఆర్థికంగా కుటుంబ సభ్యులు కుప్పకూలి పోతారు. ఆ సమయంలో మేమున్నామనే భరోసా ఆ కుటుంబానికి కొండంత ధైర్యాన్ని ఇస్తుంది.నెల రోజుల క్రితం బీర్కూర్ కి చెందిన రైతు బూత్ పల్లి అంజయ్య బీర్కుర్ బాన్సువాడ ప్రధాన రహదారి గుండా వెళ్తూండగ రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఈ సందర్భంగా ఆయన భార్య అనితకు మాజీ జెడ్పిటిసి ద్రోణవల్లి సతీష్ రైతు బీమా ప్రాసెసింగ్ కాపీని బుధవారం బీర్కూర్ గ్రామ పంచాయతీ ఆవరణలో ప్రజా ప్రతినిధులతో కలిసి అందించారు. దీంతోపాటు రెండు లక్షల రూపాయలను ఆర్థిక సహాయంగా అందించి ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రఘు, ఎంపీటీసీ సందీప్, రైతుబంధు అధ్యక్షుడు అవారీ గంగారం, కో ఆప్షన్ ఆరిఫ్, మండల పార్టీ అధ్యక్షుడు లడేగామవీరేశం, నారాయణ,పోగు నారాయణ, లాడేగామ గంగాధర్,రాజుపటేల్, మన్నన్, ఈ యటవీరేశం, తదితరులు పాల్గొన్నారు.
