అగ్నిధారన్యూస్ ,పెద్దపల్లి:
పంచాయతీ రాజ్ శాఖ ఇంజనీర్ మృతి పట్ల ఘన నివాళ్ళ
మంథని సబ్ డివిజన్ సహాయక ఇంజనీర్ కాచే కిరణ్ మృతి పట్ల. జిల్లాపంచాయతీ రాజ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా పంచాయతీరాజ్ శాఖ కార్యాలయంలో కిరణ్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పంచాయతీరాజ్ శాఖలో తను చేసినటువంటి చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు మృతుడు కిరణ్ సౌమ్యుడు మృదుస్వభావి మంచికి మారుపేరు అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ రాజ్ శాఖ ఈ ఈ మునిరాజ్, పెద్దపల్లి డి ఈ శంకరయ్య,సుల్తానాబాద్ డీఈ దేవేందర్, పంచాయతీ రాజ్ డిప్లమా ఇంజనీర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు మదన్ మోహన్ రెడ్డి ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ కార్యాలయ సిబ్బంది, అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.
