అగ్నిధారన్యూస్ ,రామగుండం;

శనివారం రోజున MPP వాల్వ అనసూర్య-రాంరెడ్డి అధ్యక్షతన పాలకుర్తి మండల సర్వసభ్య సమావేశం. నిర్వహించారు ఈ కార్యక్రమానికి రామగుండం ఎమ్మెల్యే కోరు కంటి చందర్ ముఖ్య అతిథిగా హాజరై ఈ సందర్భంగా మాట్లాడుతూ … తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికి అందుతున్నాయన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేసిన మిషన్ భగీరధ పధకం ద్వారా మండంలోని ప్రతి ఇంటికి నల్ల కనెక్షన్ అందించడం జరిగిందన్నారు. నిరుపేదల కోసం మండలంలో 248 డబుల్ బెడ్ రూం ఇళ్లను ఒకే స్థలంలో నిర్మాణం చేపడతామని, నెల రోజుల్లో స్థల పరిశీలన చేసి పనులు ప్రారంభిస్తామన్నారు. కేశోరాం కంపనీ ద్వారా వెలువడుతున్న కలుష్యం మూలంగా చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. కేశోరాం కర్మగార యాజమాన్యం కలుష్య నివారణ కు చర్యలు చేపట్టేలా చూస్తామన్నారు. రైతులు పండించిన వరిధాన్యాన్ని ప్రభుత్వం కోనుగోలు చేస్తుందని ప్రతి గ్రామంలో ఐకేసి సెంటర్లను ఏర్పాటు చేసి ధాన్యం కొనుగోలు చేయడం జరుగుతుందన్నారు. కేంద్రం రాబోవు యాసంగిలో వరిధాన్యం కొనుగోలు చేయడానికి మీనమేషాలు లెక్కిస్తూ ,ఉందన్నారు. రైతులు వ్యవసాయధికారులు సూచించిన పంటలను వేయాలన్నారు. రామగుండం నియోజవర్గంలో ప్రతి గ్రామాన్ని సుందరంగా తీర్చిదిద్దుతున్నమన్నారు. ఈ సమావేశంలో , వైస్ ఎంపిపి ఎర్రం స్వామి ఎమ్మార్వో సదానందం ఎంపీడీవో సర్పంచులు ఎంపీటీసీలు అధికారులు పాల్గొన్నారు.