అగ్నిధార న్యూస్ ,పెద్దపల్లి:
రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన జడ్పీటీసీ గంట రాములు యాదవ్ , ఈరోజు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో మిషన్ స్మైల్ ఆర్గనైజేషన్ స్వచ్చంద సేవా సంస్థ ద్వితీయ వార్షికోత్సవం సందర్బంగా, సాగర్ ఆధ్వర్యంలో 20 మంది యువకుల చేత రక్తదానం చేస్తున్న శిబిరాన్ని ముఖ్య అతిధిగా టీపీసీసీ అధికార ప్రతినిధి ఓదెల జడ్పీటీసీ గంట రాములు యాదవ్ పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రక్తదానం చేయడమనేది ఒక గొప్ప సామాజిక కార్యక్రమం అన్నారు .సమయానికి రక్తం అందించే దాత ప్రాణదాత అన్నారు. ఎవరైనా ప్రాణాపాయ స్థితిలో ఉండి రక్తం అవసరం ఉన్న సమయంలో ప్రతి ఒక్క యువకుడు స్పందించి రక్తదానం చేసి నిండు ప్రాణాన్ని కాపాడాలని కోరారు. సమయానికి రక్తం అందకపోతే ఎన్ని కోట్లు పెట్టిన బ్రతకలేడు కాబట్టి ప్రతి ఒక్కరు రక్తదానం చేయాలని కోరారు. రక్తదానం చేస్తున్న యువకులందరికి మనస్ఫూర్తిగా అభినందించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున యువకులు పాల్గొన్నారు.
