అగ్నిధార న్యూస్,పెద్దపల్లి:
మహమ్మద్ ప్రవక్త జీవితం యావత్తు మానవాళికి ఆదర్శం… మహమ్మద్ ప్రవక్త జీవితం యావత్తు మానవజాతికి ఆదర్శమని కరీంనగర్ ఉమ్మడి ఇస్లామీయ ధార్మిక పండితుల అసోసియేషన్ అధ్యక్షుడు ముఫ్తి మహమ్మద్ ఘియాస్ మొహియుద్దీన్ అన్నారు.
మహమ్మద్ ప్రవక్త జన్మదినాన్ని పురస్కరించుకుని ఆదివారం పట్టణంలోని ఎస్. బి గెస్ట్ హౌస్ లో సఫా బైతుల్ మాల్ పెద్దపల్లి శాఖ ఆధ్వర్యంలో విద్యార్తీనీ.. విద్యార్థులకు మహమ్మద్ ప్రవక్త జీవిత చరిత్రపై టాలెంట్ టెస్ట్ నిర్వహించారు. మౌలాన లయీఖుల్లా.. మౌలాన ఇంతియాజ్ ఖాన్ అసాధిల నిర్వహణలో జరిగిన ఈకార్యక్రమనికి దాదాపు 150 మంది విద్యార్థులకు పైచిలుకు హాజరయ్యారు. ఈసందర్భంగా ముఫ్తి ఘియాస్ మొహియుద్దీన్ మాట్లాడుతూ సఫా బైతుల్ మాల్ ఆధ్వర్యంలో ప్రతియేటా మహమ్మద్ ప్రవక్త జీవిత చరిత్రను రాబోయే తరాలకు, యువతకు తెలపాల్సిన బాధ్యతను.. విద్యార్థుల మేధస్సు పెంచేందుకు సీరతున్నబి టాలెంట్ టెస్ట్ నిర్వహించడం, అభినందనీయమని ,మౌలాన ఇంతియాజ్ ను అభినందించారు. వారసత్వంగా మహమ్మద్ ప్రవక్త జీవితాన్ని భవిష్యత్ తరాలకు చెప్పాల్సిన బాధ్యత ప్రతి ముస్లిం పై ఉందన్నారు. యువత..విద్యార్థులు పెడదారిన పట్టకుండా మహమ్మద్ ప్రవక్త కొన్ని జీవిత సూత్రాలు చెప్పారని వాటిని కుల, మతాలకతీతంగా అందించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉందన్నారు. విద్యార్థులకు బహుమతులు ప్రధాన కార్యక్రమం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో మౌలాన తౌసీఫ్.. ముఫ్తి ముజాహిద్, హాఫిజ్ అంజద్, ముఫ్తి ఇర్ఫాన్ తదితరులు పాల్గొన్నారు.
