అగ్నిధార న్యూస్ ,రామగుండం క్రైమ్:

Breaking News….

ప్రయాణీకులు చూస్తుండగానే ఓ యువకుడు రైలు కు ఎదరు వెళ్లి ఆత్మహత్య చేసుకున్న సంఘటన పెద్దపల్లి జిల్లా రామగుండం రైల్వేస్టేషన్ లో జరిగింది.ఓరిస్సా రాష్ట్రం కైరాకు చెందిన సంజయ్ కుమార్ తన తాతతో కలిసి హైదరాబాదు లోని ఓ హర్డ్ వేరు దుకాణం లో పనిచేస్తున్నాడు,గత మూడు సంవత్సరాలు గా మతిస్థిమితం లేకుండా ప్రవర్తిస్తున్నా సంజయ్ వైద్య చికిత్సా, కుటుంబ సభ్యులు చికిత్స చేయిస్తున్నట్లు జిఆర్ పి హెడ్ కానిస్టేబుల్ సురేష్ గౌడ్ తెలిపారు.గత కొన్ని రోజులగా మతిస్థిమితం లేకుండా తిరుగుతున్న సంజయ్ రామగుండం రైల్వేస్టేషన్ కు వచ్చి న్యూఢీల్లీ నుంచి బెంగుళూరు కు వెళ్లుతున్న రాజధాని సూపర్‌ఫాస్ట్ కు ఎదురుగా వెళ్లి ఆత్మహత్య చేసుకున్నాడు. అక్కడ ఉన్న ప్రయాణీకులు భయబ్రాంతులకు గురైనారు.