అగ్నిధార న్యూస్ ,గోదావరిఖని:
తెలంగాణ ప్రైవేట్ టీచర్స్ ఫోరం జిల్లా ప్రధాన కార్యదర్శి దామర్ల శ్రీనివాస్ స్వర్గస్తులు అయినారు అని తెలుపుటకు చింతిస్తున్నాము.
తెలంగాణ ప్రైవేట్ టీచర్స్ ఫోరం పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు ఆవుల రాజేష్ యాదవ్ మాట్లాడుతూ దామెర్ల శ్రీనివాస్ గత 25 సంవత్సరాల నుండి ప్రైవేట్ ఉపాధ్యాయ వృత్తిని చేపట్టి ఎందరో విద్యార్థులను ఉన్నత శిఖరాలకు తీసుకెళ్ళి నటువంటి వ్యక్తి , ప్రవేట్ ఉపాధ్యాయులను పెద్దపల్లి జిల్లాలో తెలంగాణ ప్రైవేట్ టీచర్స్ ఫోరం ఏర్పడిన నాటి నుండి ప్రైవేటు ఉపాధ్యాయ సమస్యలను పరిష్కారం కోసం తనదైన శైలిలో కోసం కృషి చేసినటువంటి వ్యక్తి తెలంగాణ ప్రైవేట్ టీచర్స్ ఫోరం కు పెద్దపల్లి జిల్లా కు కుడి భుజాన్ని కోల్పోవాల్సి వచ్చిందని, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఆ కుటుంబ సభ్యులకు భగవంతుడు అన్ని వేళలా మనోధైర్యాన్ని ఇవ్వాలని దామర్ల శ్రీనివాస్ చేసిన సేవలనుచేసిన గుర్తు చేసుకుంటూ వారికి నివాళులు అర్పించడం జరిగిందని, శ్రీనివాస్ కుటుంబానికి టి పి టి ఎఫ్ అండగా ఉంటుందని, తెలంగాణ ప్రైవేట్ టీచర్స్ ఫోరం పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు అన్నారు. సంతాపం తెలిపిన వారిలో ప్రైవేటు ఉపాధ్యాయులు వివిధ మండలాల అధ్యక్షులు ఉపాధ్యక్షులు రమేష్ యాదవ్, సురేష్, వెంకటేశ్వర్ల (k v r), నందు,రవీందర్, అంబాల సమ్మయ్య, చంద్రమోహన్ ,బాలరాజు, వేదశ్రీ, సుచరిత తిరుమల, రమేష్, ప్రకాష్, వరుణ్ కుమార్, కట్ట కోలా కుమార్, వసంత, తదితరులు ఉన్నారు.
