అగ్నిధార న్యూస్ ,పెద్దపల్లి:

స్వయంభువుగా వెలసిన అతి పురాతన దేవాలయం గా చెప్పబడుతున్న అటువంటి దేవస్థానం  దశాబ్దాల కాలంగా అభివృద్ధికి నోసుకోనటువంటి పరిస్థితి నుండి నేడు,  ఆలయ కార్యనిర్వహణాధికారి ముద్దాసాని శంకర్ కృషి ఫలితంగా  పెద్దపల్లి మండలం దేవునిపల్లి లో గల శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం పునర్నిర్మాణం కోసం పాలకుర్తి మండలం కుక్కల గూడూరు గ్రామానికి చెందిన, ప్రవాస భారతీయ దంపతులు అంబిక రాధా కిషన్ లు .10 లక్షల రూపాయలు విరాళంగా ఇవ్వటానికి ముందుకు వచ్చారు.   దాత ద్వారా  వచ్చేటువంటి 10 లక్షల రూపాయలు దేవాదాయ ధర్మాదాయ శాఖ లో కంట్రిబ్యూషన్ చెల్లించడం వల్ల మరో 40 లక్షల రూపాయలు ప్రభుత్వం మంజూరు చేయనున్నది. ఇట్టి నిధులతో దేవాలయ ప్రకారం రాజగోపురం, ధ్వజస్తంభం, నిర్మాణం చేపట్టనున్నారు .10 లక్షల రూపాయలు విరాళం ఇవ్వడానికి ముందుకు వచ్చిన అంబికా రాధా కిషన్ దంపతుల ను, ఆలయ ఈవో శంకర్ మరియు పూజారులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా గా గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.