టిటిఆర్ ఫౌండేషన్ అధ్యక్షులు తానిపర్తి తిరుపతి రావు
అగ్నిధారన్యూస్ పెద్దపల్లి
ఇటీవలే జరిగిన ఎన్నికల్లో టిటిఆర్ ఫౌండేషన్ ప్రధాన కార్యదర్శి ఆకారి రాజేశం నంది మేడారం జూనియర్ సివిల్ జడ్జ్ కోర్టు అడ్వకేట్స్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ గా 2026-27 సంవత్సరాలకు గాను ఎన్నికైన సందర్భంగా ఈ రోజు పెద్దపల్లి టిటిఆర్ ఫౌండేషన్ కార్యాలయం లో జరిగిన కార్యక్రమం లో సత్కరించి ఆయనకు సభ్యులు శుభాకాంక్షలు తెలియజేశారు ! ఈ సందర్భంగా టిటిఆర్ ఫౌండేషన్ అధ్యక్షులు తానిపర్తి తిరుపతి రావు మాట్లాడుతూ అడ్వకేట్ వేరు, లాయర్ వేరు అని నల్ల కోటు వేసుకున్న ప్రతి వ్యక్తి అడ్వకేట్ కాలేడు అని, అట్లని లాయర్ అయిన ప్రతీ వ్యక్తి న్యాయం చేయలేడు అని ఇక్కడ అడ్వకేట్ వేరు ! లాయర్ వేరు అని, అడ్వకేట్ అంటే లా కోర్సు చదివి న్యాయ స్థానాల్లో వాదించే వాళ్ళు అని లాయర్ అనే పదం విస్తృతమైనది అని లా తెలిసిన వ్యక్తి న్యాయం కోసం తన కేసును తాను వాదించుకోవచ్చు అని అడ్వకేట్ ఆలా కాదు అని అయన నిర్దిష్టమైన లా కోర్సు తప్పనిసరిగా చదివి ఇతరుల కేసులను వాదిస్తడు అని, మన రాజ్యాంగం లో న్యాయ వ్యవస్థకు ప్రత్యేకమైన స్థానం ఉన్నది అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం లో టిటిఆర్ ఫౌండేషన్ ఉపాధ్యక్షులు కాసర్ల మదుసూదన్ రెడ్డి, జాయింట్ సెక్రటరీ ముంజాల హరికృష్ణ గౌడ్ ఇతర సభ్యులు పాల్గొన్నారు.
