అగ్నిధార న్యూస్, పెద్దపల్లి:
సుల్తానాబాద్ కు చెందిన కాంగ్రెస్ పార్టి నాయకులు మాజీ వార్డు సభ్యులు కోట రాజయ్య ఆదివారం ప్రమాదవశాత్తు మరణించిన సంగతి తెలిసిందే ,
సోమవారం మాజీ ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు కోట రాజయ్య పార్థీవదేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించి , మృతుని కుటుంబ సభ్యులకు పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన వెంట పెద్ద ఎత్తున కాంగ్రెస్ కార్యకర్తలు ఉన్నారు.
