అగ్నిధార న్యూస్ ,పెద్దపల్లి జిల్లా:
ప్రజాసమస్యలను సత్వరమే పరిష్కరించాలి : జిల్లా కలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ.
పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ లోని తన చాంబర్లో సోమవారం ప్రజల వద్ద నుంచి అర్జిలను స్వీకరించారు. ప్రజాసమస్యల్ని సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ సంబంధిత అధికారులను, ఆదేశించారు. జిల్లా నలుమూలల నుండి వివిధ సమస్యలపై వచ్చిన ప్రజల నుండి పలు వినతులు స్వీకరించినట్లు తెలిపారు. ప్రజల నుండి వచ్చినటువంటి వినతులను సంబంధిత శాఖలకు పంపి సమస్యలు వెంటనే పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేశారు.
ఈ కార్యక్రమంలో , అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ,పాల్గొన్నారు.
