అగ్నిధార న్యూస్, పెద్దపల్లి జిల్లా:
సత్యసాయి సంస్థ సేవలు అభినందనీయం. అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ
మంగళవారం రోజున శ్రీ సత్యసాయి సేవా మందిరం పెద్దపల్లి లో పాల్గొని సత్యసాయి సేవా సంస్థ అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ అన్నారు. శ్రీ సత్యసాయి సేవా సమితి , ఆధ్వర్యంలో వృద్ధులకు దుప్పట్లు పంపిణీ, బాయ్స్ హై స్కూల్ పాఠశాల విద్యార్థులకు 50 మందికి చలిదుస్తులు పంపిణీ, ప్రైమరీ స్కూల్ విద్యార్థులు 120 మందికి చూచి వ్రాత కాపీలు పంపిణీ అదనపు కలెక్టర్ చేతుల మీదుగా పంపిణీ చేసారు. విద్యా సంస్థలు ఏర్పాటు చేసి దేశవ్యాప్తంగా పేద ప్రజలకు విద్య అందిస్తున్నారని, ప్రాణం లోని చివరి క్షణం వరకు పేద ప్రజల సంక్షేమానికి కృషి చేశారని తెలిపారు పేద ప్రజలకు విద్య వైద్యం, త్రాగునీటి సౌకర్యం అందించే దిశగా పెద్ద ఎత్తున కృషి చేసిన మహనీయుడు సత్యసాయి అని అదనపు కలెక్టర్ కొనియాడారు. . 2006 సంవత్సరంలో తాసిల్దార్ గా విధులు నిర్వహిస్తున్న సమయంలో బాబా గారిని కలిసే అవకాశం కలిగిందని తన జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. విద్యార్థులు అందిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ బాగా చదవాలని, భవిష్యత్తులో అత్యున్నత స్థానాలకు చేరుకొని మన కుటుంబం తో పాటు సమాజ శ్రేయస్సు దిశగా కృషి చేయాలని అదనపు కలెక్టర్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు వెంకటస్వామి , జిల్లా బాలవికాస్ కో ఆర్డినటర్ శ్రీమతి జ్యోతి, సేవా సంస్థ జిల్లా కోఆర్డినేటర్ వై హనుమంతరావు, కన్వీనర్ లక్ష్మీనారాయణ, తదితరులు పాల్గొన్నారు.
