అగ్నిధార న్యూస్, కరీంనగర్:

ఎల్ రమణ  అంటేనే గుర్తుకు వచ్చేది బడుగు బలహీన వర్గాల బిడ్డని దశాబ్దాలుగా అణగారిన వర్గాల నాయకత్వ బలోపేతానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్న సంగతి మనకు తెలిసినదే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రంలో దశాబ్దకాలంగా తెలుగుదేశం పార్టీకి వెన్నుదన్నుగా ఉండి  ఇటీవల కాలంలో  తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో లో చేరిన విషయం విదితమే ,ఏ పార్టీలో ఉన్న బీసీల  అభ్యున్నతికి కృషి చేస్తారు. ఇటీవల దేశ జనగణనలో బీసీ కుల గణన జరగాల్సిందేనని తెలంగాణా ప్రభుత్వం అసెంబ్లీ లో తీర్మానం చేయడంలో, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ అంశాన్ని ముఖ్య అజెండాగా ప్రధాని మోడీ కి నివేదించే క్రమంలో మాజీ మంత్రి వర్యులు ఎల్ రమణ ప్రముఖ పాత్ర పోషించిన విషయం  తెలిసినదే..నేడు కరీంనగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎల్ రమణ  నామినేషన్ వేసిన సందర్భంగా  బీసీ ముద్దుబిడ్డగా ఈ ఎన్నికలలో వారు సంపూర్ణ మెజారిటీతో విజయం సాధించాలని ఆకాంక్షిద్దాం.ఈ సందర్భంగా ఆకుల స్వామి వివేక్ పటేల్ L రమణ ని కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు.